• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Lover: పెళ్లి కూతురి ఇంటికి లేడీ గెటప్ తో ప్రియుడు, ఊడి వచ్చేసిన విగ్, సినిమా స్టైల్లో, గూబ గుయ్ !

|

వారణాసి/ చెన్నై/హైదరాబాద్: తెలుగు ప్రజలకు ఎంతో దగ్గర అయిన జబర్దస్త్ కామిడీ షోలో దాదాపుగా అందరు నటులు లేడీ గెటప్స్ వేశారు. గెటప్ శీను లేడీ గెటప్ వేస్తే ఆ క్కిక్కేవేరప్ప అంటారు జబర్దస్త్ షో అభిమానులు. అచ్చం గెటప్ శీను గెటప్ లో ఓ ప్రేమికుడు లేడీ గెటప్ వేశాడు. ఇది ఏదో టీవీ షోకు మాత్రం కాదు. పెళ్లి చేసుకుంటున్న తన ప్రియురాలికి నచ్చచెప్పడానికి, ఆమెను తనతో పిలుచుకుని వెళ్లడానికి ఆ ప్రేమికుడు నానా తంటాలు పడ్డాడు. నీట్ గా ముఖానికి షేవింగ్ చేుకుని పెదవులకు లిప్ స్టిక్ వేసుకుని కర్లింగ్ హేర్స్ విగ్ పెట్టుకుని, హైహీల్స్ వేసుకుని బ్యూటీపార్లల్ కు వెళ్లి రెఢీ అయిపోయాడు. అచ్చం అమ్మాయిలు ఎలా ఉంటారో అచ్చం అలాగే తయారై ప్రియురాలి ఇంటికి వెళ్లిపోయాడు. ప్రియురాలి రూమ్ లో ఆమెతో రహస్యంగా మాట్లాడటానికి వెలుతున్న సమయంలో గ్రహాలు మొత్తం రివర్స్ కావడంతో ప్రియుడు తల మీద ఉన్న విగ్ ఊడిపోయింది. అంతే పెళ్లి కూతురి ఇంట్లో ఉన్న వాళ్లు ఇక్కడ ఏదో జరగరానిది జరుగుతోందని ప్రియుడిని పట్టుకుని అతనికి మడత ఖాజా తినిపించి గూబ గుయ్ మనిపించారు.

Wife argument: ఇంట్లో భార్యను గొడ్డలితో నరికి రోడ్డు మీద లాక్కొని వెళ్లిన భర్త, ఏం జరిగిందంటే !Wife argument: ఇంట్లో భార్యను గొడ్డలితో నరికి రోడ్డు మీద లాక్కొని వెళ్లిన భర్త, ఏం జరిగిందంటే !

 ప్రేమికులు

ప్రేమికులు

ఉత్తరప్రదేశ్ లోని భడోహి ప్రాంతంలో నివాసం ఉంటున్న రీనా అనే యువతి, ఆ ఊరికి సమీపంలోని ఊరిలో నివాసం ఉంటున్న రాకేష్ (పేర్లు మార్చడం జరిగింది) అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన రీనా, రాకేష్ ఇంతకాలం అందరూ ప్రేమికులు లాగానే కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేశారు.

ప్రియురాలి పెళ్లి ఫిక్స్

ప్రియురాలి పెళ్లి ఫిక్స్

రీనా కుటుంబ సభ్యులు వేరే అబ్బాయితో ఆమె వివాహం చెయ్యాలని నిర్ణయించారు. పెళ్లి చేసుకోవడానికి రీనా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తన ప్రియురాలి పెళ్లి జరిగిపోతోందని తెలుసుకున్న రాకేష్ ఆ విషయం జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా ప్రియురాలు రీనాతో మాట్లాడాలని రాకేష్ ప్రయత్నించాడు.

 లేడీ గెటప్ వెయ్యాలని ఫ్రెండ్స్ స్కెచ్

లేడీ గెటప్ వెయ్యాలని ఫ్రెండ్స్ స్కెచ్

రీనా, రాకేష్ ప్రేమ వ్యవహారం ఆమె కుటుంబ సభ్యులకు అంతకు ముందే తెలుసు. రీనా దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కు ఆమె కుటుంబ సభ్యులు లాక్కొన్నారు. పెళ్లి రోజు దగ్గర పడటంతో రాకేష్ లో టెన్షన్ మొదలైయ్యింది. ఎలాగైనా రీనాను కలవాలని ఆమె ప్రియుడు రాకేష్ డిసైడ్ అయ్యారు. నువ్వు చూడటానికి ఎర్రగా, అందంగా ఉన్నావని, నువ్వు లేడీ గెటప్ వేసుకుని ఆమె ఇంటికి వెలితే ఏ సమస్య రాదని రాకేష్ కు అతని ఫ్రెండ్స్ ఉచిత సలహా ఇచ్చేశారు.

లేడీస్ డ్రెస్, హైహీల్స్ చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, విగ్

లేడీస్ డ్రెస్, హైహీల్స్ చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, విగ్


ముఖం నీట్ గా షేవ్ చేసుకున్న రాకేష్ అమ్మాయిలాగా రెఢీ అయ్యి ప్రియురాలి ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. బ్యూటీపార్లల్ కు వెళ్లి అయ్యాయిలాగా రెఢీ అయిపోయాడు. సూపర్ గా ఉండే లేడీ డ్రెస్ తీసుకున్నాడు. వీపుకు బ్రా తగిలించుకుని లోపల రెండు యాపిల్ పండ్లు పెట్టుకున్నారు. పెదవులకు లిప్ స్టిక్ వేసుకుని, భుజానికి లేడీస్ హ్యాండ్ బాగ్ తగిలించుకుని, కాళ్లకు హైహీల్స్ చెప్పులు వేసుకుని, తల మీద కర్లింగ్ హేర్ విగ్ పెట్టుకుని అచ్చం అమ్మాయిలాగా రెఢీ అయిపోయాడు.

ఏమాత్రం డౌట్ రాలేదు

ఏమాత్రం డౌట్ రాలేదు

రాకేష్ చూడటానికి అచ్చం అమ్మాయిలాగా రెఢీ అయిపోయాడు. కొత్తవాళ్లు చూస్తే రాకేష్ ను ఎవ్వరూ మగాడు అనికోని విధంగా రెఢీ అయిపోయాడు. ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి బైక్ లో రీనా ఇంటికి వెళ్లిపోయాడు. రీనా ఇంటిలో పెళ్లి సందడి మొదలైయ్యింది. బైక్ దిగిన రాకేష్ ముఖానికి దుప్పటా కప్పుకుని నడుచుకుంటూ రీనా ఇంటిలోకి వెళ్లిపోయాడు.

ఫిగర్ అదిరింది.... కానీ ఏదో తేడా ఉంది

ఫిగర్ అదిరింది.... కానీ ఏదో తేడా ఉంది

ఖరీదైన డ్రెస్ వేసుకుని రీనా ఇంటిలోకి వెళ్లిన రాకేష్ ను చూసిన మగాళ్లు అబ్బా ఎవరు ఫిగర్ భలే ఉందని, బహుషా పెళ్లి కూతురు ఫ్రెండ్ అని అందరూ అనుకున్నారు. పెళ్లి కూతురు ఏ గదిలో ఉంది అని రాకేష్ అక్కడ ఉన్న వాళ్లని అడిగాడు. చూస్తే కత్తిలాంటి ఫిగర్ అనుకుంటే గొంతు చూస్తే ఏమిటి ఇలా ఉంది ? అని పెళ్లి కూతురు బంధువులకు డౌట్ వచ్చేసింది.

 చేతిలోకి ఊడి వచ్చేసిన విగ్

చేతిలోకి ఊడి వచ్చేసిన విగ్


ఎవరు నువ్వు ?, ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ?. నువ్వు పెళ్లి కూతురు స్నేహితురాలివా ? అంటూ రీనా బంధువులు ప్రశ్నల వర్షం కురిపించారు. అంతే రాకేష్ మైండ్ బ్లాక్ అయ్యి తిక్కతిక్క సమాధానాలు చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఓ యువకుడు రాకేష్ జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అతని తల మీద తగిలించుకున్న లేడీస్ విగ్ ఊడి వాళ్ల చేతిలోకి వెళ్లిపోయింది.

 గూబ గుయ్ మనింది

గూబ గుయ్ మనింది


అమ్మాయి డ్రెస్ లో వచ్చింది మగాడు అని తెలుసుకున్న రీనా బంధువులు సహనం కోల్పోయి అందరూ ఒక్కో చెయ్యి వెయ్యడంతో రాకేష్ గూబ గుయ్ మనింది. దెబ్బలు తింటున్న రాకేష్ చిక్కిపోతాను అనే భయంతో విగ్, హైహీల్స్ చెప్పులు, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అక్కడే వదిలిసి పరుగు తీశాడు. బయట బైక్ లో రెడీగా ఉన్న స్నేహితులతో కలిసి రాకేష్ పరారైనాడు.

దొంగ కాదు....... పెళ్లి కూతురు లవర్

దొంగ కాదు....... పెళ్లి కూతురు లవర్

మొదట ఎవరో పెళ్లి ఇంటిలోకి వచ్చి బంగారు నగలు చోరీ చెయ్యడానికి ప్రయత్నించాడని అందరూ అనుకున్నారు. తరువాత పెళ్లి కూతురు లవర్ లేడీ గెటప్ లో వచ్చాడని వెలుగు చూసింది. అయితే పెళ్లి కూతురి ప్రేమ విషయం తెలిసే పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడని తెలిసింది. రాకేష్ లేడీ గెటప్ లో వెళ్లి ఇంట్లో దూరాడని ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యలేదని, అందుకే కేసు నమోదు చెయ్యలేదని స్థానిక పోలీసులు అన్నారు. పెళ్లి కూతురి ప్రియుడు లేడీ గెటప్ తో వెళ్లిన విషయం ఉత్తరప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Girlfriend: People can go to any lengths for love and a striking example of it was recently seen in Uttar Pradesh’s Bhadohi where a young man disguised himself as a woman to sneak into his girlfriend’s home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X