బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Students: శానిటైజర్ బాటిల్స్ పేలిపోయి విద్యార్థులకు ?, హాస్టల్ వెనుక ఏం జరిగింది ?, వార్డెన్ డ్రామాలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ఉడిపి: పేద కుటుంబాలకు చెందిన అబ్బాయిలు హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారు. ప్రతిరోజు హాస్టల్ నుంచి స్కూల్ కు వెళ్లి వస్తున్నారు. హాస్టల్ వెనుక వైపు విపరీతంగా చెత్త వేస్తున్నారు. హాస్టల్ వెనుక చెత్తకు నిప్పంటించారు. ఆ సందర్బంలో మంటలు శ్యానిటైజర్ బాటిల్స్ కు వ్యాపించి పేలిపోయాయి. శ్యానిటైజర్ బాటిల్స్ నుంచి మంటలు వ్యాపించి నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలైనాయి. అధికారులకు సమాచారం ఇవ్వకుండా హాస్టల్ వార్డెన్ విద్యార్థులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాడు. ఓ బాలుడి పరిస్థితి విషమించడంతో మ్యాటర్ బయటకు వచ్చింది.

Lady techie: భార్యను స్పాట్ లో చంపేసిన బ్యాంక్ మేనేజర్, లవ్ మ్యారేజ్, మరో టెక్కీతో భార్యకు !Lady techie: భార్యను స్పాట్ లో చంపేసిన బ్యాంక్ మేనేజర్, లవ్ మ్యారేజ్, మరో టెక్కీతో భార్యకు !

ఆశ్రమ హాస్టల్

ఆశ్రమ హాస్టల్

ఉడిపి జిల్లాలోని కార్కళ తాలుకాలోని హబ్రిలో ఆశ్రమ అనే బాయ్స్ హాస్టల్ ఉంది. ఇతర జిల్లాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన అబ్బాయిలు హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారు. ఆశ్రమ హాస్టల్ లో 50 మందికి పైగా స్కూల్ లో చదువుతున్న అబ్బాయిలు ఉన్నారు. హాస్టల్ ఉన్న అబ్బాయిలు ప్రతిరోజు నుంచి స్కూల్ కు వెళ్లి వస్తున్నారు.

పేలిపోయిన శ్యానిటైజర్ బాటిల్స్

పేలిపోయిన శ్యానిటైజర్ బాటిల్స్

ఆశ్రమ హాస్టల్ వెనుక వైపు విపరీతంగా చెత్త వేస్తున్నారు. హాస్టల్ వెనుక పేరుకు పోయిన చెత్తకు నిప్పంటించారు. ఆ సందర్బంలో మంటలు శ్యానిటైజర్ బాటిల్స్ కు వ్యాపించి ఆ బాటిల్స్ పేలిపోయాయి. శ్యానిటైజర్ బాటిల్స్ నుంచి మంటలు వ్యాపించి నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలైనాయి.

సీక్రేట్ గా చికిత్స

సీక్రేట్ గా చికిత్స

శ్యానిటైజర్ బాటిల్స్ పేలిపోయి నాలుగవ తరగతి చదువుతున్న శ్రీనివాస్, అమరేష్, ఐదవ తరగతి చదువుతున్న మనోజ్, వినోద్ అనే నలుగురు అబ్బాయిలకు తీవ్రగాయాలైనాయి. హాస్టల్ వార్డెన్ సీక్రేట్ గా అతని స్నేహితుడి కారులో శ్రీనివాస్, అమరేష్, మనోజ్, వినోద్ లను ఉడిపిలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాడు.

హాస్టల్ వార్డెన్ నాటకాలు

హాస్టల్ వార్డెన్ నాటకాలు

పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా హాస్టల్ వార్డెన్ నాటకాలు ఆడాడు. ఓ బాలుడి పరిస్థితి విషమించడంతో ఆలస్యంగా ఈ విషయం వెలుగు చూసింది. హాస్టలో ఉన్న అబ్బాయిలను చూసుకోవడానికి రాత్రిపూట ఎవ్వరూ ఉండరని, ఉదయం, రాత్రి వంట చేసే మహిళ తరువాత ఇంటికి వెళ్లిపోతుందని, ఎప్పుడో ఒకసారి వార్డెన్ వచ్చి వెలుతుండాటని హబ్రి గ్రామ పంచాయితీ అధ్యక్షురాలు మాలతి పై అధికారులకు ఫిర్యాదు చేసింది. గాయాలైన అబ్బాయిలకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

English summary
Boys: Students are sick due to the explosion of the sanitizer bottle near Udupi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X