శోభనం జరిగిన మూడో రోజే బిడ్డకు జన్మనిచ్చిన పెళ్లి కూతురు.. తండ్రి ఎవరో తెలుసా..?
కొన్ని వినడానికి, చూడటానికి కూడా విచిత్రంగా అనిపిస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. శోభనం కూడా మంచిగానే జరిగింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ, శోభనం అయిన మూడో రోజుకే పెళ్లి కూతురు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది.ప్రయాగ్‌రాజ్‌లోని కార్చన తహసీల్ గ్రామానికి చెందిన యువకుడితో జస్రా గ్రామానికి చెందిన అమ్మాయికి ఫిబ్రవరి 24న వివాహం జరిగింది.
తర్వాత కార్యం కూడా అంతా సాఫీగానే సాగింది. అయితే ఫిబ్రవరి 26 పెళ్లి కూతురు కడుపు నొప్పిగా ఉందని చెబుతూ కేకలు వేయడం మొదలుపెట్టింది. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా, అక్కడ డాక్టర్లు మైండ్ బ్లాక్ అయ్యే విషయాన్ని బయటపెట్టారు.ఆమె గర్భవతి అని, వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలని చెప్పి డాక్టర్లు షాకిచ్చారు.2 గంటల తర్వాత ఆ మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

కొత్తగా పెళ్లి చేసుకొని అత్తంటికి వచ్చిన మహిళ మూడో రోజే బిడ్డకు తల్లిగా మారడంతో పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు పరువు మొత్తం పోయింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులను పిలిపించారు. మీ కూతురు గర్భవతి అని చెప్పకుండా తమతో వివాహం జరిపించారని చెప్పి, పెళ్లి కూతురు తల్లిదండ్రులపై మండిపడ్డారు.దీనిపై పెళ్లి కూతురు తల్లిదండ్రులు సైతం అదిరి పోయే ట్విస్ట్ ఇచ్చారు.
దీనిపై అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి వరుడు తమ కూతురితో కలిసి ఉంటున్నాడని, అతని వల్లే మా కూతురు గర్భవతి అయిందని చెప్పి వారు మరో బాంబ్ పేల్చారు. గత ఏడాది మే నెలలో కూతురి వివాహం నిశ్చయించబడిందని అమ్మాయి తండ్రి తెలిపారు. అప్పటి నుండి ఆ అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు కలుసుకుంటున్నారని చెప్పాడు.అయితే పెళ్లి కూతురు తల్లిదండ్రులు చెప్పేది అబద్దమని, దీనిపై ఎలాంటి విచారణకు అయినా తాను సిద్ధమే అని పెళ్లి కొడుకు ప్రకటించాడు. తన వివాహం 4 నెలల క్రితం అక్టోబర్ నెలలో నిశ్చయమైందని ఇంతలోనే తల్లి ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీంతో ఎవరు చెబుతున్నది నిజమో ఎవరికి అర్థం కావడం లేదు.
పెళ్లి కూతురు గర్భవతి కావడంతో పెళ్లికి ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పెళ్లి కొడుకు వర్గం డిమాండ్ చేయగా, కట్నం తీసుకుని వివాహం చేసుకున్నారని పెళ్లి కొడుకు వర్గంపై కేసు పెడతామని పెళ్లి కూతురు వర్గం హెచ్చరించారు.నా కూతుర్ని కాపురానికి తీసుకువెళ్లకపోతే.. చనిపోతానంటూ అమ్మాయి తల్లి వార్నింగ్ ఇచ్చింది.దీంతో ఈ పంచాయితీ ఇరు వర్గాల పెద్దలకు చేరింద. ప్రస్తుతం పెళ్లి కూతురు బిడ్డతో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications