తనను కాదన్నదని పెళ్లికూతురిని కాల్చి చంపాడు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు గురువారం రాత్రి పెళ్లి పీటల మీదనే ఓ యువతిని అందరూ చూస్తుండగా కాల్చి చంపాడు. ఈ సంఘటన భోపాల్‌లోని లాల్‌ఘటి మ్యారేజీ గార్డెన్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
గురువారం రాత్రి గం.11.15 నిమిషాల ప్రాంతంలో అనురాగ్ అనే వ్యక్తి వచ్చి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. అక్కడ ఉన్నవారు అతన్ని పట్టుకున్నారు. అతన్ని పోలీసులకు అప్పగించారు. కాల్పుల్లో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించింది.

తనను మోసం చేయడం వల్లనే జయశ్రీ నామ్‌దేవ్ అనే ఆ మహిళను చంపినట్లు అనురాగ్ పోలీసులకు చెప్పాడు. జయశ్రీ నామ్‌దేవ్ వృత్తిరీత్యా వైద్యురాలు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, జయశ్రీ ఎప్పుడు కూడా అనురాగ్‌ను ప్రేమించిట్లు కనిపించలేదని అంటున్నారు. ఆమె ఆ విధమైన సంకేతాలను ఇవ్వలేదని చెబుతున్నారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/rF1guDSrQ3U?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications