ఒక్క రోజులో పెళ్లి: పెళ్లి కుమార్తె ను చంపిన తల్లి

న్యూఢిల్లీ: ఒక్క రోజులో పెళ్లి ఉందనగా కన్న కుమార్తెను ఆమె తల్లి దారుణంగా హత్య చేసింది. ముఖం మీద తల దిండు పెట్టి హత్య చేసింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని సీలంపూర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ఒక్క రోజులో పెళ్లి ఉండటంతో తల్లి షాపింగ్ కు వెళ్లారు. తరువాత ఆమె తిరిగి ఇంటికి చేరుకునింది.

ఆమె కుమార్తె ( పెళ్లి కుమార్తె) ఇంటిలో అద్దెకు ఉండే వ్యక్తితో బెడ్ రూంలో అసభ్యకరంగా కనపడింది. తల్లిని చూసిన ఆ వ్యక్తి అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. కుమార్తె ప్రవర్తన మీద అసహ్యం చెందిన తల్లి ఆవేశం పట్టలేక తల దిండు తీసుకుని కుమార్తె ముఖం మీద పెట్టి చంపేసింది.

Bride smothered to death day before Wedding in New Delhi

తరువాత కుమారుడికి విషయం చెప్పింది. అప్పటికే ఇంటిలో చుట్టాలు చాల మంది ఉన్నారు. వెంటనే కుమారుడితో కలిసి ఆమె కుమార్తెను లోక్ నాయక్ ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. చుట్టాలకు తన కుమార్తెకు గుండె పోటు వచ్చిందని చెప్పింది. ఆసుపత్రిలో మాత్రం వైద్యులకు పెళ్లి కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని చెప్పింది.

వైద్యపరిక్షలు నిర్వహించడంతో పెళ్లి కుమార్తె హత్యకు గురైయ్యిందని వెలుగు చూసిందని పోలీసు అధికారులు చెప్పారు. తల్లి, కుమారుడి మీద కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారవేత్తతో యువతి వివాహం జరగవలసి ఉంది. ఇంటిలో అద్దెకు ఉంటున్న వ్యక్తితో పెళ్లి కుమార్తెకు చాల కాలం నుంచి సంబంధం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+