"మోసం చేసినందుకే దేవుడు శిక్షించాడు"-వినేష్ ఫోగట్ పై బ్రిజ్ భూషణ్ షాకింగ్ కామెంట్స్..!
పారిస్ ఒలింపిక్స్ లో తృటిలో పతకం కోల్పోయిన మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆ తర్వాత ఆటకు గుడ్ బై చెప్పి తాజాగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆమెను హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపింది. దీంతో వినేష్ ఫోగట్ గతంలో పోరాడిన రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆమెను టార్గెట్ చేశారు. వినేష్ ఒలింపిక్ పతకం కోల్పోవడంపై బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జులనా నుండి రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఫోగట్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒకప్పుడు పోరాడిన బ్రిజ్ భూషణ్ తిరిగి ఆమెను టార్గెట్ చేశారు. ఓ క్రీడాకారిణి ఒక్క రోజులో రెండు బరువు కేటగిరీల్లో ట్రయల్స్ ఇవ్వగలరా అని వినేష్ ఫోగట్ ను బ్రిజ్ భూషణ్ ప్రశ్నించారు. ఓసారి బరువు తూకం తర్వాత ట్రయల్స్ ను ఆపగలరా అని కూడా అడిగారు. కాబట్టి మీరు రెజ్లింగ్ లో గెలవలేదని, మోసం చేసి అక్కడికి వెళ్లారని, అందుకే దేవుడు శిక్షించాడని బ్రిజ్ భూషణ్.. వినేష్ ఫోగట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

వాస్తవానికి క్రీడారంగంలో హర్యానా దేశానికి ఓ కిరీటం లాంటిదని, కానీ రెజ్లర్లు రెండున్నరేళ్లుగా రెజ్లింగ్ ను ఆపేశారని, బజరంగ్ ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడలకు వెళ్లింది నిజం కాదా అని బ్రిజ్ భూషణ్ ప్రశ్నించారు. తాను ఎప్పటికీ అమ్మాయిలను అగౌరవపరచనని, అలా వారిని అగౌరవపర్చింది మాత్రం వినేష్, భజరంగ్ పూనియానే అని బ్రిజ్ భూషణ్ ఆరోపించారు. వీరిద్దరినీ చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకరోజు పశ్చాత్తాపపడాల్సి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications