వారి కోసం ‘రోహిత్ వేముల చట్టం’!

విద్యా వ్యవస్థలో కొనసాగుతున్న కులవివక్ష అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. విద్యావ్యవస్థలో నేటికీ బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కుంటున్నాయన్నారు. దళిత విద్యార్థులు ఎవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే 'రోహిత్ వేముల'(Rohith Vemula) చట్టాన్ని రూపొందించి, అమలు చేయాలని తన లేఖలో రాహుల్ పేర్కొన్నారు.

నేటికీ మన విద్యావ్యవస్థలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఇటువంటి వివక్షను ఎదుర్కోవడం సిగ్గుచేటని రాహుల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేద్కర్ జీవితంలో ఎదుర్కొన్న కుల వివక్ష గురించి ఈ లేఖలో రాహుల్ రాసుకొచ్చారు.

Bring Rohith Vemula Act Rahul Gandhi s letter to Karnataka CM Siddaramaiah

వెనుకబడిన వర్గాల బిడ్డగా అంబేద్కర్ ఎదుర్కొన్న కష్టాన్ని మరే బిడ్డా ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవడానికి సిద్దరామయ్య కృషి చేస్తారని తాను నమ్ముతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు చూపిన వివక్షతో రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోయారన్నారు.ఇకనైనా ఇలాంటి హత్యలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రాహుల్ గాంధీ.

కాగా, 2016 జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల కారణంగానే రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత సంఘాలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు వారి ఆందోళనలకు మద్దతు తెలిపారు.

Take a Poll

విద్యాసంస్థల్లో దళిత విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రోహిత్ వేముల చట్టం రూపొందించాలని అప్పుడు డిమాండ్‌లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని కోరడం గమనార్హం. మరోవైపు, రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న ఎనిమిదేళ్ల తర్వాత మృతుడి తల్లి విజ్ఞప్తి మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఈ కేసుపై పునర్ విచారణ ప్రారంభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+