పరిస్థితి విషమం: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

న్యూఢిల్లీ: దేశంలో నిర్భయ ఘటనను మరువక ముందే అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగింది. 13 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణమైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీలోని పుల్ ప్రహ్లాద్‌పూర్ ప్రాంతంలో బాలికపై అత్యాచారం జరిపి ఆ తర్వాత రైల్వే ట్రాక్ సమీపంలో పడేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. అనాథ అయిన ఆ బాలికను ప్రస్తుతం ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బాధితురాలు పుల్ ప్రహ్లాద్‌పూర్ సమీప గ్రామంలో తన మేనమామ ఇంట్లో నివసించేది.

కాగా, బాలిక ఈ నెల 17వ తేదీన కనిపించకుండా పోయింది. మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక కోసం గాలింపు జరిపినప్పటికీ ఆచూకీ దొరకలేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే 18వ తేదీ తెల్లవారుజామున రైల్వే ట్రాక్ సమీపంలో ఆ బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఎయిమ్స్‌కు తరలించారు.

Brutally raped 13-year-old fighting for life at AIIMS

దీంతో బాలికపై లైంగిక దాడి జరిగిందని డాక్టర్లు ధ్రువీకరించడంతో సంబంధిత సెక్షన్ల కింద, చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా, నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని చెప్పారు. ఇదిలా ఉంటే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ బుధవారం ఎయిమ్స్‌కు వెళ్లి బాలికను చూశారు.

బాలికను అతి దారుణంగా రేప్ చేశారని, బహుశా ఇది సామూహిక అత్యాచారమై ఉండవచ్చని అనుమానిస్తున్నామని ఆమె అన్నారు. బాలిక ఇంతటి దారుణమైన అత్యాచారాని గురైనప్పటికీ ఢిల్లీ పోలీసులు అధికారికంగా తమకు ఈ సంఘటన గురించి తెలియజేయలేదని ఆమె చెప్పారు.

దీనిపై ఢిల్లీ పోలీసులకు నోటీసులు అందజేస్తామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను ఎలా నిరోధించాలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూర్చొని మాట్లాడుకోవాలని ఆమె సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+