వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-పాక్ సరిహద్దు: రూ. 60 కోట్ల హెరాయిన్ సీజ్

|
Google Oneindia TeluguNews

అమృత్ సర్: భారత్ లోకి అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ (డ్రగ్స్)ను భారత జవాన్లు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంలో పాకిస్థాన్ కు చెందిన స్మగ్లర్స్ తప్పించుకుని భారత్ సరిహద్దు దాటి తప్పించుకున్నారు.

ప్రతి రోజు రాత్రి భారత్- పాక్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఆ సందర్బంలో పంజాబ్ లోని చిన్న బిద్ చంద్ సెక్టార్ లోని పంట పోలాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారి మీద బీఎస్ఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు నిఘా వేశారు.

BSF seized Rs.60 crore heroin near Indo-Pak border

పాకిస్థాన్ కు చెందిన స్మగ్లర్లు చిక్కిపోతామని భయపడి 12 కేజీల హెరాయిన్ ను పంట పోలాల్లో వదిలివెళ్లారని బుధవారం అమృత్ సర్ లో బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేదని స్పష్టం చేశారు.

స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ. 60 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. 2015 జనవరి నుంచి నేటి వరకు భారత్- పాక్ సరిహద్దు ప్రాంతాలలో రూ.1,150 కోట్ల విలువైన 230 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని బీఎస్ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు.

English summary
Altogether 12 kg of heroin, having a street value of Rs 60 crore, was seized from an agriculture field at Chhina Bidhi Chand sector near Indo-Pak border in the wee hours today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X