వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం మీద కేసు పెట్టిన మాజీ సీఎం, ఆపరేషన్ కమల, ఆడియో టేపులు నకిలి, న్యాయ నిపుణులు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆపరేషన్ కమలలో భాగంగా విడుదలైన ఆడియో టేప్ ల గురించి కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆడియో టేప్ ల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మీద చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి కుమారస్వామి మీద చేసిన ఫిర్యాదుపై విధాన సౌధ పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదని సమాచారం. సీఎం కుమారస్వామి మీద ఎలా కేసు నమోదు చెయ్యాలి అని సూచించాలి అంటూ న్యాయనిపుణుడు గణేష్ బాబుకు విధాన సౌధ పోలీసులు లేఖ రాశారు.

ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడు శరణ్ గౌడకు విరుద్దంగా విధాన సౌధ పోలీసులకు బీఎస్. యడ్యూరప్ప ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి తనకు అనుకూలంగా ఆడియో టేప్ ను కట్ చేసి విడుదల చేశారని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఫిర్యాదు చేశారు.

BSY- HDK Audio Clip Row: Vidhana Soudha police seeks legal advice in the case.

దేవదుర్గలోని గెస్ట్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడు శరణ్ గౌడ, పాత్రికేయుడు మలమకర్ తో పాటు అనేక మంది ఆపరేషన్ కమల గురించి చర్చలు జరిపారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆడియో టేప్ ను మీడియాకు విడుదల చేశారు.

తన అధికారాన్ని దుర్వనియోగం చేసిన ముఖ్యమంత్రి కుమారస్వామి మీద చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధాన సౌధ పోలీసులు ఈ కేసును ఎలా విచారణ చెయ్యాలి అంటూ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు.

English summary
BSY- HDK Audio Clip Row : Vidhana Soudha police seeks legal advice in the case. BJP has filed complaint against CM HD Kumaraswamy that audio is fabricated created and truncate one and it is a plot hatched by HDK and his associated to tarnish the reputation of BS Yeddyurappa, BJP claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X