బడ్జెట్: ధరలు తగ్గేవి. పెరిగేవి, ఆదాయ పరిమితి పెంపు
హైదరాబాద్: కేందర్ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌ను బట్టి సబ్బుల ధరలు తగ్గనున్నాయి. అలాగే ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీల ధరలు కూడా తగ్గనున్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన ఎడ్యుకేషన్ సెస్. పెట్రో కెమికల్స్ పైన కస్డమ్స్ డ్యూటీ తగ్గింపు ఉంది. 19 అంగులాల లోపు టీవీ పైన కస్టమ్స్ డ్యూటీ మినహాయించారు. నూనె ధరలు తగ్గనున్నాయి. పాదరక్షల పైన ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. దీంతో వీటి రేట్లు తగ్గనున్నాయి. సిమెంట్ ధరలు తగ్గే అవకాశముంది.
సిగరేట్ల పైన ఎక్సైజ్ సుంఖం 11 శాతం నుండి 72 శాతానికి పెంచారు. దీంతో సిగరేట్ల ధరలు భారీగా పెరిగే అవకాశముంది. అలాగే గుట్కాల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశముంది. ఇనుము తగ్గే అవకాశముంది. పర్‌ఫ్యూమ్స్ కూడా తగ్గే అవకాశం. శీతల పానీయాల పైన పన్ను పెంచారు. దీంతో కూల్ డ్రింక్స్ పెరిగే అవకాశముంది. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు పెరిగే అవకాశముంది. మొబైల్ రేట్లు కూడా పెరగనున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్ ధరలు తగ్గే అవకాశం.

పెరిగేవి...
దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు, సిగరేట్లు, ట్యాక్సీలు, సోలార్, కంప్యూటర్లు, కూలర్, ల్యాప్ టాప్‌లు, రిఫ్రిజరేటర్, కూల్ డ్రింక్స్, పొగాకు ఉత్పత్తులు.
తగ్గేవి...
పర్‌ఫ్యూమ్స్, సబ్బులు, ట్యూబ్ లైట్లు, బల్బులు, సిమెంట్, ఇనుము, ఖరీదైన కార్లు, ప్లాస్మా టీవీలు, నూనెలు, పెట్రో కెమికల్స్, సిమెంట్, ఐరన్, సోలార్ ప్యానల్స్, క్రీడా వస్తువులు, బ్రాండెడ్ దుస్తులు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ మానిటర్లు.
ఆదాయ పరిమితి...
ఆదాయపన్ను పరిమితిని రూ..2 లక్షల నుండి 2.5 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షలకు పెంచారు. గృహ నిర్మాణాల పైన రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపును ఇచ్చారు. పొదుపు పథకాలపై లక్షన్నర వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు.












Click it and Unblock the Notifications