కేంద్ర బడ్జెట్ 2018: వాహనదారులకు ఊరట.. తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు?

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాహనదారులకు కొంత ఊరట కలిగించే అంశాన్ని ప్రకటించారు. బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 వరకు తగ్గే అవకాశమున్నట్లు తెలిసింది. బ్రాండెడ్ పెట్రోల్‌పై విధిస్తున్న రూ.7.66 ఎక్సైజ్ సుంకం రూ.5.66కు తగ్గనుంది. అన్‌‌బ్రాండెడ్ పెట్రోల్‌పై కూడా ప్రస్తుతం విధిస్తున్న రూ.6.48 ఎక్సైజ్ సుంకం కూడా రూ.4.48కు తగ్గనుంది.

Budget 2018: Petrol, diesel get excise duty cut of Rs.2

అదేవిధంగా బ్రాండెడ్ డీజిల్‌పై రూ.10.69 ఎక్సైజ్ సుంకం రూ.8.69కు తగ్గే అవకాశముంది. అన్‌బ్రాండెడ్ డీజిల్‌పై లీటర్‌కు విధిస్తున్న రూ.8.33 ఎక్సైజ్ సుంకం రూ.6.33కు తగ్గనున్నట్లు తెలిసింది.

మొత్తం మీద రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న వాహనదారులకు ఇది కొంత ఊరట కలిగించే అంశమేనని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+