వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

union budget 2021లో ప్రైవేటుకు పెద్దపీట -3న కార్మిక సంఘాల దేశవ్యాప్త నిరసనలు

|
Google Oneindia TeluguNews

గడిచిన ఏడేళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా తెగనమ్ముతోన్న మోదీ సర్కారు.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ ప్రైవేటైజేషన్ కు పెద్ద పీట వేయడాన్ని కార్మిక లోకం నిరసిస్తోంది. ప్రభుత్వ బ్యాంకులు, రైల్వేలు, లాభాల్లో నడుస్తోన్న పీయూసీలు, నవరత్నాలు.. ఇలా దేన్నీ వదలకుండా ప్రైవేటు పరం చేయడంతోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లాగా తెరిచారంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో..

కేసీఆర్‌ను కమాండ్ చేస్తా -వాళ్ల ఏడుపును సీఎం తట్టుకోలేడు: మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలుకేసీఆర్‌ను కమాండ్ చేస్తా -వాళ్ల ఏడుపును సీఎం తట్టుకోలేడు: మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు

ప్రైవేటీకరణ సహా బడ్జెట్‌లో పొందుపరిచిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు బుధవారం దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నాయి. జాతీయ స్థాయిలో పనిచేస్తోన్న పది కేంద్ర కార్మిక సంఘాలు ఈ మేరకు మంగళవారం పిలుపునిచ్చాయి. గ్రామాలు మొదలుకొని మహానగరాల దాకా అంతటా బుధవారం కార్మికులు కదంతొక్కాలని యూనియన్ల నేతలు కోరారు.

 Budget 2021:Trade unions nationwide protest on feb 3 against privatisation policies

లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయడంతో పాటు పేద కార్మికులకు ఆహారం, ఆదాయం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హిందూ మజ్దూర్‌ సభ, సీఐటీయూ, టీయూసీసీ వంటి పది కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపు ఇచ్చినట్టు కార్మిక సంఘాల సంయుక్త ఫోరం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

జగన్ వల్ల జనంలో సోమరితనం -దాన్ని మోదీ సహించరు -అందుకే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సున్నా: వైసీపీ ఎంపీజగన్ వల్ల జనంలో సోమరితనం -దాన్ని మోదీ సహించరు -అందుకే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సున్నా: వైసీపీ ఎంపీ

Recommended Video

Union Budget 2021 : Ponnala Lakshmaiah Made Comments Over Union Budget 2021

నిరసనల్లో భాగంగా భారీ ప్రదర్శనలు, కార్యస్ధానాల్లో సమావేశాలు నిర్వహించి లేబర్‌ కోడ్స్‌ను ప్రతులను దగ్ధం చేస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జాతి వ్యతిరేక విధ్వంసకర విధానాలకు నిరసనగా భవిష్యత్‌లో తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తిరోగమన దిశగా ఉండటంతో పాటు వాస్తవ పరిస్ధితికి దూరంగా ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

English summary
A joint platform of 10 central trade unions on Tuesday gave a call for a nationwide protest on February 3 against privatisation and other "anti-people" policies proposed in the Budget for 2021-22 and to press for scrapping labour codes and providing income and food support to the families of poor workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X