పోయాం మోసం: చెప్పిందొకటి.. చేసిందొకటి
NDA Government: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. నివురు గప్పిన నిప్పులా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన నెలన్నర రోజుల వ్యవధిలో కేంద్రం రూపొందించిన ఈ వార్షిక బడ్జెట్ పట్ల ఏ వర్గం కూడా సంతృప్తికరంగా ఉండట్లేదు. బాధ్యతారహితంగా దీనికి రూపకల్పన చేశారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఆ ఓటుబ్యాంక్ దూరం?
ఏ ఓటుబ్యాంక్ ద్వారా మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిందో.. అదే ఓటుబ్యాంక్ ఇప్పుడు దూరమైనట్టే కనిపిస్తోంది. మధ్య, దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గోరుచుట్టుపై రోకలిపోటులా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

35 శాతం ఓట్లు..
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మధ్యతరగతి ఓటుబ్యాంకే బీజేపీకి అండగా ఉంటుంది. 2014 నుంచి 2024 వరకు వారి వల్లే మెజారిటీ సీట్లను దక్కించుకుందా పార్టీ. 35 శాతం, అంత కంటే ఎక్కువ మంది 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతు పలికారని అమితాబ్ తివారీ అనే విశ్లేషకుడు వెల్లడించారు. 2024 ఎన్నికల్లో తగ్గుదల కనిపించిందని పేర్కొన్నారు.
11 శాతం అధికం..
సీఎస్డీఎస్- లోక్‌నీతి పోస్ట్ పోల్ సర్వే ప్రకారం మధ్యతరగతి ఓట్లలో బీజేపీకి మూడు శాతం మేర తగ్గుదల కనిపించింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు రెండు శాతం మేర ఓట్లు అధికంగా వచ్చాయని తేలింది. అయినప్పటికీ- కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలకు పడే మధ్య తరగతి ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే బీజేపీ వైపు మొగ్గు చూపే వారి సంఖ్య 11 శాతం అధికమని అమితాబ్ తివారీ వివరించారు.
బీజేపీకి సంపూర్ణ మెజారిటీ దక్కకపోవడానికి..
మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ దక్కకపోవడానికి మధ్యతరగతి ఓట్లు మూడు శాతం మేర తగ్గడమే కారణం. ఇండియా కూటమి 230కి పైగా స్థానాలను దక్కించుకోవడంలో ఈ ఓట్లే కీలకంగా మారాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగా, ఈ దఫా ఆ సంఖ్య 240కి పడిపోయిన విషయం తెలిసిందే.
2004 నాటి ఓటమికీ..
2004 నాటి ఎన్నికల్లో కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఓడిపోవడం వెనుక మధ్యతరగతి ఓట్ల మార్పు ఇదే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మధ్యతరగతి ఓటుబ్యాంక్ తమ వెంట ఉండాలన్నా, వీడాలన్నా వార్షిక బడ్జెట్ విధానాలే నిర్ధారిస్తాయని స్పష్టం చేస్తోన్నారు.
సహనం సన్నగిల్లింది..
ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితిని మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. మధ్యతరగతి ప్రజలు పన్నులు చెల్లించడం ద్వారా దేశ నిర్మాణానికి సహకరిస్తూ వస్తోన్నారు. 2014 నుంచి ఎలాంటి ఊరట వారికి లభించకపోవడం వల్ల వారి సహనం సన్నగిల్లినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు.
కష్టాలను అర్థం చేసుకునేలా..
మధ్యతరగతి ప్రజల కష్టాలను అర్థం చేసుకోవాల్సిన ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు దేశానికి అత్యవసరమని అమితాబ్ తివారీ పేర్కొన్నారు. మోదీ సర్కార్‌లోని చాలామంది మంత్రులు ప్రజలకు దూరంగా ఉంటోన్నారని, వారి అవసరాలను నిజంగా అర్థం చేసుకునే వాళ్లు కావాలని తేల్చి చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోలేరని స్పష్టం చేశారు.
పన్ను చెల్లింపుదారుల్లో..
దేశంలో పన్ను చెల్లింపుదారుల్లో అత్యధికం మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. కార్పొరేట్లతో పోల్చుకుంటే క్రమం తప్పకుండా పన్ను కట్టే మధ్య తరగతి కుటుంబీకుల సంఖ్యే అధికం. ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో మొత్తం 11,56,000 మేర ఆదాయపు పన్ను కట్టొచ్చని కేంద్రం అంచనావేసింది. కార్పొరేట్ పన్నుల సంఖ్య 10,42,830 మాత్రమే.
ఎన్డీఏకు కష్టకాలం..
ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగితే మధ్య తరగతి కుటుంబాల మద్దతు ఎన్డీఏ కోల్పోవడం ఖాయమౌతుందని అమితాబ్ తివారీ అభిప్రాయపడ్డారు. అమెరికా వంటి పన్నులు, సోమాలియా వంటి సౌకర్యాలు దేశంలో తలెత్తాయంటూ ఓ యూట్యూబర్ పోస్ట్ చేసిన కామెంట్లను ఆయన గుర్తు చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications