కేన్సర్ వ్యాధిగ్రస్తులకు కేంద్రం భారీ ఉపశమనం
Nirmala Sitharaman: వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ఉభయ సభల ముందుకు వచ్చింది. 2025- 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు ఇవి. సరిగ్గా ఈ ఉదయం 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.
ఊహించినట్టే- బిహార్‌కు భారీ నజరానా ప్రకటించారు. అక్కడ మకనా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మకానా పండించే రైతులు ఎక్కువగా ఉండే రాష్ట్రం అది. దీన్ని తమ రాష్ట్రంలో నెలకొల్పాలంటూ చాలాకాలంగా బిహారీలు డిమాండ్ చేస్తూ వస్తోన్నారు. దీని పట్ల ఆమె సానుకూలంగా స్పందించారు.

ప్రాణాంతక వ్యాధుల బారిన పడ్డ వారికి భారీ ఉపశమనాన్ని ప్రకటించారు నిర్మల సీతారామన్. కేన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు ఊరట కల్పించారు. ఆయా వ్యాధుల కోసం వినియోగించే మందులు, మెడిసిన్లు, ఇతర డ్రగ్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించనున్నట్లు వెల్లడించారు.
కేన్సర్ సహా మొత్తం 36 రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఇందులో ఉన్నాయి. ఇదివరకే కొన్ని ప్రాణాంతక వ్యాధులను నయం చేయడానికి వినియోగించే మెడిసిన్లకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీని మినహాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మరో 36 రకాల జబ్బులను చేర్చినట్లు నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
దీనివల్ల వైద్య చికిత్సలో వినియోగించే మెడిసిన్లు, ఇతర డ్రగ్స్ కొనుగోలు భారం కొంత మేర తగ్గుతుంది. 10 సంవత్సరాల పాటు ఈ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు కొనసాగుతుంది. ఆ తరువాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దీన్ని కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.












Click it and Unblock the Notifications