అమ్మా నిర్మలమ్మా.. నమోః నమః: కరుణించు తల్లీ
Nirmala Sitharaman : వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ఉభయ సభల ముందుకు వచ్చింది. 2025- 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు ఇవి. కొద్దిసేపటి కిందటే- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభించారు. సుమారు రెండుగంటల పాటు ఈ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది.
ఈ ఉదయం 8:30 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరిన నిర్మల సీతారామన్.. నేరుగా తన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సహాయ మంత్రి పంకజ్ చౌదరి, సలహాదారు అనంత నాగేశ్వరన్, ఇతర అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. మర్యాదపూరకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు బయలుదేరారు.

అనంతరం కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. పార్లమెంట్ భవనం సమావేశం హాలులో ఈ భేటీ ఏర్పాటైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహించారు. బడ్జెట్ ప్రతిపాదలను ఆమోదించడానికి ప్రత్యేకంగా కేంద్ర మంత్రులు సమావేశం అయ్యారు. బడ్జెట్ గ్లాన్స్ కాపీలను ఆమె మంత్రులకు అందజేశారు. అనంతరం దీన్ని మంత్రివర్గం ఆమోదించింది. అరగంటలోనే ఈ భేటీ ముగిసింది.
ఈ బడ్జెట్‌పై వేతన జీవులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. దీన్ని తగ్గించాలని కోరుకుంటోన్నారు. ట్యాక్స్ టెర్రరిజం నుంచి విముక్తి కలగాలని ప్రార్థిస్తోన్నారు. భారత్ వంటి అత్యధిక జనాభా, అదే స్థాయిలో పేద, మధ్య తరగతి కుటుంబీకులు ఉన్న దేశంలో గతంలో ఎప్పుడూ లేనంతగా పన్నులు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే.
అటు జీఎస్టీ సైతం పెనుభారంగా మారిందనడంలో సందేహాలు అక్కర్లేదు. బియ్యం, పప్పు, ఉప్పు, పాలు, పెరుగు, బిస్కెట్లు.. ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు ఏ ఒక్కదాన్నీ వదిలపెట్టలేదు కేంద్ర ప్రభుత్వం. ఇందులో నుంచి ఉపశమనం లభించాలని ప్రార్థిస్తోన్నారు.
Prayers Started 💐😀
— CA Vivek Khatri (@CaVivekkhatri) February 1, 2025
Source - Whatsapp FWD pic.twitter.com/PjSkfnXEeb
ఈ క్రమంలో.. కనీసం ప్రస్తుత బడ్జెట్‌లోనయినా నిర్మల సీతారామన్ తమపై కరుణ కటాక్షాలను కురిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తోన్నారు మధ్య తరగతి కుటుంబీకులు, ఇన్వెస్టర్లు కూడా. ఈ క్రమంలో- ఓ ఇన్వెస్టర్.. టీవీలో నిర్మల సీతారామన్ ఫొటోకు పూజ చేయడం ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.












Click it and Unblock the Notifications