బిహార్‌తో బోణీ- భారీ నజరానా: నక్క తోక తొక్కిన నితీష్
Nirmala Sitharaman: వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ఉభయ సభల ముందుకు వచ్చింది. 2025- 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు ఇవి. కొద్దిసేపటి కిందటే- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభించారు.
ఈ ఉదయం 8:30 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరిన నిర్మల సీతారామన్.. నేరుగా తన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సహాయ మంత్రి పంకజ్ చౌదరి, సలహాదారు అనంత నాగేశ్వరన్, ఇతర అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. మర్యాదపూరకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు బయలుదేరారు.

అనంతరం కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. పార్లమెంట్ భవనం సమావేశం హాలులో ఈ భేటీ ఏర్పాటైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహించారు. బడ్జెట్ ప్రతిపాదలను ఆమోదించడానికి ప్రత్యేకంగా కేంద్ర మంత్రులు సమావేశం అయ్యారు. బడ్జెట్ గ్లాన్స్ కాపీలను ఆమె మంత్రులకు అందజేశారు. అనంతరం దీన్ని మంత్రివర్గం ఆమోదించింది. అరగంటలోనే ఈ భేటీ ముగిసింది.
సరిగ్గా ఉదయం 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని బిహార్‌తో ఆరంభించారు నిర్మల సీతారామన్. బిహార్‌కు భారీ నజరానా ప్రకటించారు. అక్కడ మకనా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మకానా పండంచే రైతులు ఎక్కువగా ఉండే రాష్ట్రం అది. దీన్ని తమ రాష్ట్రంలో నెలకొల్పాలంటూ చాలాకాలంగా బిహారీలు డిమాండ్ చేస్తూ వస్తోన్నారు.
మకానా బోర్డు అంటే తెలంగాణలో పసుపు బోర్డుతో సమానంగా చెప్పుకోవచ్చు. తాజాగా దీన్ని అక్కడ నెలకొల్పనున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో కీలక భాగస్వామిగా ఉంటోన్న నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు కేంద్రం ఈ నజారానాను ప్రకటించినట్టయింది.
ఈ బోర్డు ఏర్పాటుచేయడం పట్ల జనతాదళ్ (యునైటెడ్) హర్షం వ్యక్తం చేసింది. మకానా బోర్డును ఏర్పాటు చేయడం వల్ల దీని ఆధారిత పరిశ్రమలు అక్కడ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. చిన్న తరహా పరిశ్రమలు, మకానా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఊతమిచ్చినట్టవుతుంది. ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల లభిస్తాయి.












Click it and Unblock the Notifications