Union Budget 2025: పార్లమెంటులో రచ్చ.. కుంభమేళా ఘటనపై విపక్షాల ఆందోళన..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇటీవల ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై ప్రతిపక్షపార్టీలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాల ఆందోళల మధ్యే.. బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అన్న గురజాడ సూక్తిని నిర్మలమ్మ ప్రస్తావించారు. మరోవైపు విపక్షాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వ వైఖరి తెలపాలంటూ నిలదీశాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం వారిని వారిస్తూనే బడ్జెట్ ప్రవేశపెట్టారు.

కుంభమేళా తొక్కిసలాట..
జనవరి 29 'మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం ఆచరించాలన్న ఉద్దేశంతో ప్రజలు భారీగా గుమిగూడారు.రద్దీ కారణంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు 30 మంది భక్తులు మరణించారు. మరో90 మందికి గాయాలైనట్లు సమాచారం. వీరంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మృతుల్లో 25 మందిని గుర్తించామని మహాకుంభ్ డీఐజీ పేర్కొన్నారు. అదనపు వివరాల కోసం హెల్ప్ లైన్ 1920ను సంప్రదించవచ్చని సూచించారు.












Click it and Unblock the Notifications