Budget 2025: నేడే కేంద్ర బడ్జెట్, నిర్మలమ్మ రికార్డ్ బ్రేక్! ఆశలు, అంచనాలు
కేంద్ర బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఇది 8వ సారి కావడం విశేషం. కాగా, కేంద్ర బడ్జెట్‌పై సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈసారిైనా ఆదాయపన్నుపై భారీ ఊరట కలిగిస్తారేమోనని వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
వార్షికంగా రూ. 15 లక్షల వరకు సంపాదిస్తున్నవారు తమకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుందని ఆశిస్తున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 75,000 నుంచి రూ. 1 లక్షకు పెంచడంతో కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదనంగా, సెక్షన్ 87A కింద రాయితీని రూ.10 లక్షలకు పెంచవచ్చని తెలుస్తోంది.

నిర్మల సీతారామన్ బడ్జెట్ రికార్డు
ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిది బడ్జెట్లు సమర్పించి తన రికార్డును తానే బద్దలు కొట్టనున్నారు. గతంలో, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 1959-64, 1967-69 మధ్య కాలంలో పది బడ్జెట్‌లతో అత్యధిక బడ్జెట్‌ను సమర్పించిన రికార్డును కలిగి ఉన్నారు. ఇతర ప్రముఖ ఆర్థిక మంత్రులలో తొమ్మిది బడ్జెట్‌లతో పి చిదంబరం, ఎనిమిది బడ్జెట్‌లతో ప్రణబ్ ముఖర్జీ వరుసలో ఉన్నారు.
ఆరోగ్య సంరక్షణ రంగం క్యాన్సర్ మందులపై సుంకం మినహాయింపులు, నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. స్టార్టప్‌లు కూడా సవాళ్లతో కూడిన సమయాల్లో తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రభుత్వం నుంచి విధాన మద్దతు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి.
బడ్జెట్ తేదీ ఎప్పుడు ఎలా వచ్చింది?
కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే తేదీని 2017లో ఫిబ్రవరి 1కి మార్చారు. ఈ మార్పు మార్చి-ఆఖరులోగా పార్లమెంటరీ ఆమోదాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది. అంతేగకా, ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తూ ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది. తాజా బడ్జెట్ బడ్జెట్ ప్రెజెంటేషన్ శనివారం (ఫిబ్రవరి 1) ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు, కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు భారీ ఆశలే పెట్టుకున్నాయి. అయితే, కొద్ది గంటల్లోనే ఈ విషయం తేలిపోనుంది.












Click it and Unblock the Notifications