నిర్మలమ్మ నోట చంద్రబాబు మాట: పీపీపీ విధానంలో రూ.లక్ష కోట్లు..!!

Nirmala Sitharaman: వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ఉభయ సభల ముందుకు వచ్చింది. 2025- 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు ఇవి. సరిగ్గా ఈ ఉదయం 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.

ఊహించినట్టే- బిహార్‌కు భారీ నజరానా ప్రకటించారు. అక్కడ మకనా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మకానా పండించే రైతులు ఎక్కువగా ఉండే రాష్ట్రం అది. దీన్ని తమ రాష్ట్రంలో నెలకొల్పాలంటూ చాలాకాలంగా బిహారీలు డిమాండ్ చేస్తూ వస్తోన్నారు. దీని పట్ల ఆమె సానుకూలంగా స్పందించారు.

Budget 2025 Urban Challenge Fund will setup with Rs 1 lakh crore

మకానా బోర్డు అంటే తెలంగాణలో పసుపు బోర్డుతో సమానంగా చెప్పుకోవచ్చు. తాజాగా దీన్ని అక్కడ నెలకొల్పనున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో కీలక భాగస్వామిగా ఉంటోన్న నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు కేంద్రం ఈ నజారానాను ప్రకటించినట్టయింది.

దేశంలో పట్టణీకరణ శరవేగంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో భారీ ప్రాజెక్టును ప్రకటించారామె. అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను నెలకొల్పబోతోన్నట్లు వెల్లడించారు. లక్ష కోట్ల రూపాయలతో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

పట్టణీకరణ వేగవంతమౌతోందని, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనడానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను నెలకొల్పాలని ప్రతిపాదిస్తోన్నట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. ఇందులో 25 శాతం వరకు బ్యాంకబల్ ప్రాజెక్టులు. మరో 50 శాతం బాండ్ల ద్వారా నిధులను సమీకరించాల్సి ఉంటుంది. మిగిలిన 25 శాతం మేర నిధులను బ్యాంకులు, పీపీపీ విధానంలో సమీకరిస్తారు.

అలాగే కేపిటల్ ఎక్స్‌పెండిచర్ (క్యాపెక్స్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల కోసం 1.5 లక్షల కోట్ల రూపాయలను 50 సంవత్సరాల పాటు ఎలాంటి రుణాలు లేకుండా రాష్ట్రాలకు అందజేయనున్నట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. ప్రతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-సంబంధిత మంత్రిత్వ శాఖ పీపీపీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు మూడు సంవత్సరాల కాల పరిమితితో నిధులు అందుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+