బడ్జెట్ ను డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ దెబ్బేసిందా?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉదయం సరిగ్గా 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమౌతుంది. దాదాపుగా మూడు గంటల పాటు ఏకధాటిగా కొనసాగే అవకాశం ఉంది. ఇది- ఆమె వరుసగా సమర్పించనున్న తొమ్మిదో బడ్జెట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంటరీ చరిత్రలో ఓ అరుదైన మైలురాయిగా నిలువనుంది.

ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతోండటం చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే- అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు డ్రైవింగ్ ఫోర్స్ గా భావించే పలు కీలక రంగాలపై దృష్టి సారించడం ఖాయంగా కనిపిస్తోంది. రైల్వేలు, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఎంఎస్ఎంఈ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి.

Budget 2026-27 Unveiled on a Sunday A Rare Record-Breaking Moment in the New Tariff Era by USA

పన్ను చెల్లింపుదారులు, వ్యాపార వర్గాలు సైతం ఉపశమన చర్యలు, ప్రాధాన్యతా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, వినియోగం, పెట్టుబడులను పెంచే చర్యల దిశగా బడ్జెట్ ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు అనేక ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. సంసద్ టీవీ యూట్యూబ్ ద్వారా వివిధ భాషల్లో బడ్జెట్ ప్రసంగం అందుబాటులో ఉంటుంది. అలాగే, దూరదర్శన్ ఛానెళ్లు పార్లమెంట్ కార్యకలాపాలను లైవ్ టెలికాస్ట్ చేస్తాయి.

అధికారిక కేంద్ర బడ్జెట్ వెబ్‌సైట్ indiabudget.gov.inలో కూడా ఈ ప్రసంగాన్ని స్ట్రీమ్ చేయనుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB)ల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోనూ ప్రత్యక్ష అప్‌డేట్‌లు లభిస్తాయి. అనేక వార్తా వెబ్‌సైట్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు రోజంతా ప్రత్యక్ష కవరేజీని, విశ్లేషణను అందిస్తాయి.

నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోని పార్ట్ బీపై అందరి చూపూ నిలిచింది. సాధారణంగా బడ్జెట్ ప్రసంగాల్లో పార్ట్ ఎ ఆర్థిక వ్యవస్థ సమీక్ష, విస్తృత విధాన మార్గదర్శనాలను ప్రస్తావిస్తారు. పార్ట్ బీలో పన్ను ప్రతిపాదనలు, ఆదాయ వ్యయాలు వంటివి ఉంటాయి. ఈసారి సీతారామన్ పార్ట్ బీలో అసాధారణంగా సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు. తక్షణ విధాన చర్యలు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై ఆమె ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టబోతోండటం చర్చనీయాంశమైంది. దీనిపై టారిఫ్ ఎఫెక్ట్ ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే స్టీల్, కాపర్, కాటన్, డైమండ్స్, సహా అనేక నిత్యావసర సరుకులపైనా 50 శాతం టారిఫ్ భారం పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయా రంగాలు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోన్నాయి. వాటికి ఉపశమన చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+