మారిన బడ్జెట్ ముఖచిత్రం: గత 11 బడ్జెట్లలో మోదీ సర్కార్ సాధించిన మైలురాళ్లు ఇవే!

Budget 2026: దేశ ముఖచిత్రాన్ని మార్చే దేశ ఆర్థిక పద్దును నేడు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. గత 11 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ను కేవలం ఆదాయ-వ్యయాల పట్టికగా మాత్రమే కాకుండా.. దేశ ఆర్థిక దిశను, భవిష్యత్తు వ్యూహాలను నిర్ణయించే శక్తివంతమైన సాధనంగా మార్చింది. 2014లో సామాన్యులకు పన్ను ఉపశమనంతో మొదలైన ఈ ప్రయాణం.. నేడు రూ.12 లక్షల వరకు పన్ను రహిత ఆదాయం, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల వరకు చేరుకోవడం విశేషం.

సంస్కరణల తొలి అడుగులు(2014-2016)
ప్రభుత్వం తన ప్రారంభ బడ్జెట్‌లలో మౌలిక సదుపాయాలు, సామాన్యులకు ఊరటనివ్వడంపై దృష్టి సారించింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.2.5 లక్షలకు, సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షలకు పెంచారు. ఇదే కాలంలో డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి భారీ ప్రచారాలకు పునాది పడింది. జన్ ధన్ యోజన, ముద్రా రుణాలు, అటల్ పెన్షన్ యోజన ద్వారా పేదలకు బ్యాంకింగ్ సేవలు చేరువయ్యాయి.

Budget 2026 Key Milestones of PM Modi 11 Budgets and Future Economic Vision for India

వ్యవసాయం, గ్రామీణ వికాసం(2016-2019)
ఈ కాలంలో ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం ఒక కీలక సంస్కరణ. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ప్రారంభమైంది. పీఎం-కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందించడం ప్రారంభించారు.

ఆత్మనిర్భర్ భారత్, కొవిడ్ అనంతర కాలం(2019-2024)
భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగింది. కొవిడ్ సమయంలో ఆరోగ్య బడ్జెట్‌ను రెట్టింపు చేసి రూ.2.23 లక్షల కోట్లకు పెంచారు. వ్యాక్సినేషన్ కోసం రూ.35,000 కోట్లు కేటాయించారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని ప్రవేశపెట్టారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్, డిజిటల్ రూపాయి, సావరిన్ గ్రీన్ బాండ్ల వంటి వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు.

అమృత కాలం, మధ్యతరగతికి ఊరట (2025-26)
గత బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకుండా చేయడం ఒక విప్లవాత్మక నిర్ణయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు), న్యూక్లియర్ ఎనర్జీ, రీసెర్చ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో భారీ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక లోటును 4.4 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం దేశ ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది.

గత దశాబ్ద కాలంలో భారత బడ్జెట్ కేవలం సంక్షేమ రాజ్యం నుంచి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా అడుగులు వేసింది. డిజిటల్ ఇండియా నుంచి గ్రీన్ ఇండియా వరకు, రైతుల నుంచి స్టార్టప్‌ల వరకు ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ సాగిన ఈ ప్రయాణం.. రాబోయే కాలంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+