Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget 2026: మధ్యతరగతికి బడ్జెట్ వరాలివే..!

Budget 2026: ప్రతి సంవత్సరం బడ్జెట్ అనగానే మధ్యతరగతి ప్రజలు ఆశగా చూసేది ఆదాయపు పన్ను ఏమైనా తగ్గుతుందా అనేది ముందు చూస్తారు. ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్లో టాక్స్ స్లాబుల్లో పెద్దగా మార్పులు లేకపోయినా.. పరోక్షంగా మన జేబుకు ఊరటనిచ్చే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసలు ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి లాభం కలిగించే విషయాలేమిటో చూద్దాం.

ట్యాక్స్ విషయంలో మార్పు ఉందా?
చాలా మంది ఆశించినట్లుగా ఈ సారి ఆదాయపు పన్ను స్లాబుల్లో ప్రభుత్వం ఎలాంటి కొత్త మార్పులు చేయలేదు. అంటే పోయిన ఏడాది ఉన్న రూల్స్ ఈ ఏడాది కూడా వర్తిస్తాయి. కొత్త పన్ను విధానం తీసుకున్న వారికి ఏడాదికి రూ.12 లక్షల వరకు సంపాదన ఉంటే ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీనికి తోడు ఉద్యోగులకు ఉండే రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే.. మొత్తం రూ.12.75 లక్షల వరకు జీతం ఉన్నవారికి ట్యాక్స్ సున్నా అన్నమాట. ఉద్యోగులకు ఇది ఓ రకంగా ఊరటే అని చెప్పవచ్చు.

Budget 2026 Middle Class Relief via 2Percent TCS Cut on Foreign Tours and Rs 12 75L Tax-Free Income

విదేశీ చదువులు, టూర్లు వెళ్లేవారికి గుడ్ న్యూస్
మధ్యతరగతి ఇళ్లలో ఇప్పుడు పిల్లలను విదేశాలకు పంపడం లేదా ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లడం ఇటీవల సాధారణం అయిపోయింది. అయితే విదేశాలకు డబ్బు పంపేటప్పుడు ప్రభుత్వం టీసీఎస్(Tax Collected at Source) పేరుతో భారీగా పన్ను వసూలు చేసేది. ఇప్పుడు దానిని ప్రభుత్వం భారీగా తగ్గించింది. విదేశీ టూర్ ప్యాకేజీల మీద గతంలో 5 శాతం నుంచి 20 శాతం వరకు ఉన్న టీసీఎస్‌ను ఇప్పుడు 2 శాతానికి తగ్గించేశారు. పిల్లల చదువుల కోసం లేదా విదేశాల్లో వైద్యం కోసం పంపే నిధుల మీద కూడా పన్నును 2 శాతానికి తగ్గించారు. దీనివల్ల విదేశాల్లో చదివించే తల్లిదండ్రులకు చేతిలో ఎంతో కొంత డబ్బు మిగులుతుంది.

ఆరోగ్యం విషయంలో భారీ ఊరట
మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రి బిల్లుల కంటే మందుల ఖర్చే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సలో వాడే 17 రకాల మందుల మీద పన్నులను పూర్తిగా ఎత్తేసింది. దీనివల్ల క్యాన్సర్ మందుల ధరలు భారీగా తగ్గుతాయి. అలాగే మరికొన్ని అరుదైన వ్యాధుల మందుల మీద కూడా పన్ను రాయితీలు ఇచ్చారు.

ఏవి చౌకగా దొరుకుతాయి?
మనం ఇంట్లో వాడే వస్తువుల ధరల విషయంలో కూడా కొన్ని మార్పులు జరిగాయి. మొబైల్ ఫోన్లు, టీవీలు, కెమెరాలు, మైక్రోవేవ్ ఓవెన్లు, లెదర్ వస్తువుల (బ్యాగులు, బూట్లు) తయారీలో వాడే విడిభాగాలపై పన్నులు తగ్గించారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కాస్త తగ్గే ఛాన్స్ ఉంది.

పెట్టుబడి పెట్టే వారికి, ప్రమాద బాధితులకు మేలు
మనలో చాలామంది షేర్ మార్కెట్‌లో చిన్న చిన్న పెట్టుబడులు పెడుతుంటారు. కంపెనీలు షేర్లను బైబ్యాక్ (తిరిగి కొనుగోలు) చేసినప్పుడు వచ్చే లాభాల మీద పన్ను నిబంధనలను సామాన్య ఇన్వెస్టర్లకు లాభం చేకూర్చేలా మార్చారు. ఇక రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి లేదా మరణించిన వారి కుటుంబాలకు కోర్టుల ద్వారా వచ్చే నష్టపరిహారం వడ్డీ మీద ఇప్పటిదాకా టాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇకపై ఆ వడ్డీ మీద పన్నును రద్దు చేశారు. ఇది బాధితులకు పెద్ద ఊరట.

కొత్త ఉద్యోగాలు వస్తాయా?
దేశంలో రోడ్లు, రైల్వేలు, టూరిజం వంటి రంగాల్లో ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది. దీనివల్ల మౌలిక సదుపాయాలు పెరగడమే కాకుండా, యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. నిర్మలమ్మ బడ్జెట్ చూస్తుంటే.. డైరెక్ట్‌గా జేబులో డబ్బులు పెట్టకపోయినా, విదేశీ ఖర్చులు, హాస్పిటల్ బిల్లులు, నిత్యావసర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గించడం ద్వారా మధ్యతరగతికి కాస్తంత వెసులుబాటు కల్పించారని చెప్పొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+