Budget 2026: రైల్వే ట్రాక్‌పైనే రాజకీయ భవిష్యత్తు

మరో 15 రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టబోతుంది. ఇది రైల్వే కోసం చేసే కేటాయింపులు కడా చాలా కీలక పాత్ర కూడా పోషించబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా చాలా రాష్ట్రాలు రైల్వే జోన్లు కోసం ప్రత్యేక విజ్ఞప్తులు కేంద్రానికి పంపాయి. అయినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితం లేదు. కానీ ఈ సారి మాత్రం రైల్వే పరంగా వరాల జల్లు కురిసే అవకాశం స్పష్టంగా ఉంది. ముఖ్యంగా ఆ 5 రాష్ట్రాలకు వద్దన్నా కూడా వదలకుండా నిర్మలమ్మ నిధులు ఇచ్చే ఛాన్స్ భారీగా ఉంది.

అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్ర బడ్జెట్ 2026లో రైల్వే రంగం కీలక రాజకీయ ఆయుధంగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన రైల్వే రంగం... ఈసారి కేవలం అభివృద్ధి కోసమే కాకుండా, ఎన్నికల వ్యూహాల్లో భాగంగానూ కీలక పాత్ర పోషించబోతోంది. అందుకే సామాన్య ప్రయాణికుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకూ అందరి దృష్టి ఈసారి రైల్వే కేటాయింపులపైనే నిలిచింది.

Budget 2026 Railways Take Center Stage as Poll-Bound States Come into Focus

ఎన్నికల రాష్ట్రాలకే ప్రాధాన్యత?

తాజా అంచనాల ప్రకారం బడ్జెట్ 2026లో రైల్వే రంగానికి కేటాయింపులు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 5 శాతం పెరిగి రూ. 2.65 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ భారీ నిధుల్లో పెద్ద భాగం ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకే మళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

  • అస్సాం: ఈశాన్య ప్రాంతానికి గేట్‌వే కావడంతో కొత్త లైన్లు, ఫ్రైట్ కారిడార్‌లపై ఫోకస్
  • పశ్చిమ బెంగాల్: ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్టేషన్ అభివృద్ధి, సబర్బన్ రైళ్ల విస్తరణ
  • తమిళనాడు: ఇండస్ట్రియల్ కారిడార్‌లు, పోర్ట్ కనెక్టివిటీ, సౌత్ లో బలం పెంచుకోవడానికి రాజకీయ వ్యూహం
  • కేరళ: హైస్పీడ్, సేఫ్టీ అప్‌గ్రేడ్స్‌, టూరిజం కనెక్టివిటీ,
  • పుదుచ్చేరి: చిన్న రాష్ట్రమైనా ప్రత్యేక రైల్వే ప్యాకేజీలతో రాజకీయ లాభాల ప్రయత్నం

PPP విధానం

ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేట్ పెట్టుబడులు (PPP మోడల్) కీలకంగా మారనున్నాయి. ప్రత్యేకంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో రైల్వే కోచ్ తయారీ, వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ పార్కులు, స్టేషన్ రీడెవలప్‌మెంట్ వంటి ప్రాజెక్టులకు ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించే అవకాశముంది. ఇది అభివృద్ధితో పాటు ఉద్యోగాలు కల్పించే అంశంగా ఎన్నికల్లో ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.

సరుకు రవాణాలో అస్సాం-బెంగాల్ కీలకం

నేషనల్ రైల్ ప్లాన్ ప్రకారం 2030 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం... ఈ లక్ష్యాన్ని సాధించడంలో అస్సాం, పశ్చిమ బెంగాల్ కీలకంగా మారనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఖనిజాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ ట్రాన్స్ పోర్ట్ జరుగుతుంది. బెంగాల్ ద్వారా పోర్ట్ ఆధారిత రవాణా, తమిళనాడు పోర్ట్‌లకు ఫ్రైట్ కనెక్టివిటీ పై కేంద్రం బాగా ఫోకస్ చేసింది.

కొత్త రైల్వే జోన్లు - ఎన్నికల అస్త్రంగా మారతాయా?

బడ్జెట్ లో మరో కీలక అంశంగా కొత్త రైల్వే జోన్లు, డివిజన్ల ప్రతిపాదనలు చర్చకు వస్తున్నాయి. ఎన్నికలున్న రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, ప్రాంతీయ అసంతృప్తిని తగ్గించడం, అభివృద్ధి హామీలను అమలు చేసి చూపించడమే లక్ష్యంగా కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. కొన్ని ప్రాంతాలకు కొత్త జోన్ లేదా డివిజన్ ప్రకటనలు రావచ్చన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం ఈ రేసులో ముందున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

అభివృద్ధి బడ్జెట్టా? ఎన్నికల బడ్జెట్టా?

మొత్తానికి బడ్జెట్ 2026 లో రైల్వే రంగం కేవలం ప్రయాణికుల భద్రత, వేగం, సౌకర్యాలకే పరిమితం కాకుండా... ఎన్నికల రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే సాధనంగా, ప్రాంతీయ సమీకరణాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అస్సాం నుంచి కేరళ వరకూ... రైల్వే ట్రాక్‌పైనే రాజకీయ భవిష్యత్తు పరుగులు తీయబోతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+