Budget 2026: ఏపీకి బడ్జెట్ లో వరుస వరాలు, భారీ కేటాయింపులు..!!

ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తమ ప్రాధాన్యతలు ఉంటాయని వెల్లడించారు. పవిత్ర మాఘపూర్ణిమ రోజున బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ప్రపంచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానిస్తున్న ట్లుగా చెప్పుకొచ్చారు. ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్నమని చెప్పారు. వికసిత భారత్‌లో భాగంగా యువత ఆకాంక్షలను అద్దం పట్టేలా బడ్జెట్‌ను తీసుకొచ్చామని నిర్మలా తన ప్రసంగం లో స్పష్టం చేసారు. అదే విధంగా ఏపీ మీదుగా పలు నిర్ణయాలు అమలు వెల్లడించారు.

2025-26 వార్షిక బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రారంభోపన్యాసంలోనే ప్రాధాన్యతలను స్పష్టం చేసారు. పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోందని వివరించారు. సంస్కరణల ఎక్స్‌ప్రెస్ మాదిరిగా మా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. బయోఫార్మా మ్యాన్యుఫ్యాక్చ రింగ్ హబ్ కోసం రానున్న ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

Budget 2026 To accelerate and sustain economic growth I propose interventions in six areas - Nirmala sitaraman

జనవరిలో స్థూల GST వసూళ్లు 6.2% పెరిగి రూ.1.93 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రధానంగా దిగుమతుల నుండి అధిక ఆదాయం లభించింది. మొత్తం వాపసులు 3.1% తగ్గి రూ.22,665 కోట్లకు చేరుకున్నాయి. అయితే నికర GST వసూళ్లు జనవరిలో 7.6% పెరిగి రూ.1.71 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు. మౌలిక సదుపా యాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ మొత్తం రూ.11.2 లక్షల కోట్లు గా ఉంది.

కేటాయింపులు.. ప్రాధాన్యతలు

భారత్ ఖనిజ పారిశ్రామిక విధానంలో కేంద్ర ప్రభుత్వ సంచలన అడుగు వేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో ఎర్త్ మినరల్ కారిడార్ ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ ఎర్త్ మినరల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మల వెల్లడించారు. దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు, సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్‌లో చేయూత ప్రకటించారు. మెగా టెక్స్‌టైల్ పార్క్‌ నిర్మాణం పైన స్పష్టత ఇచ్చారు. సెమీ కండక్టర్ మిషన్ 2.O ప్రారంభం అవుతుందని చెప్పారు.

త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభం పైనా స్పష్టత ఇచ్చారు. టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి కొత్త పథకం తెస్తున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కొత్త మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖాదీ, హ్యాండ్లూమ్‌, హస్తకళల ప్రోత్సాహానికి పథకం అమలు చేస్తామన్నారు. అత్యంత నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి పథకం తీసుకొస్తున్నట్లు వివరించారు. 200 పారిశ్రామిక క్లస్టర్స్‌ ఆధునీకరణకు చేయూత ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+