నూతన సాంప్రదాయానికి తెర తీస్తున్నాం, సహకరించండి: మోడీ
రాష్ట్రపతి ప్రసంగం సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ స్వాగతిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగం సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ స్వాగతిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంటులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రసంగం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు.
బడ్జెట్ సమావేశాలు సుహృద్భావ వాతావరణంలో అర్ధవంతంగా జరగాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడంతో నూతన సాంప్రదాయానికి తెరతీస్తున్నామని అన్నారు.

'ఈ రోజు కొత్త సాంప్రదాయం మొదలవుతోంది. ఒకటి బడ్జెట్ సమావేశాలు నెల ముందుగానే ప్రారంభమయ్యాయి. ఇంకోటి రైల్వే బడ్జెట్.. సాధారణ బడ్జెట్‌తో కలిపి ప్రవేశపెట్టడం జరుగుతోంది. ఇదే భవిష్యత్‌లో కూడా కొనసాగుతుంది' అని మోడీ చెప్పారు.
అంతకుముందు ప్రతీ బడ్జెట్ సాయంత్రం 5గంటలకు ప్రవేశపెట్టేవారు.. అది మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పాయి హయాంలో మారిపోయిందని గుర్తు చేశారు. బడ్జెట్ సమావేశాలు ఫల ప్రదంగా జరగాలని, ప్రజలకు మేలు జరిగేలా కొనసాగాలని మోడీ ఆకాంక్షించారు.
బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు పార్టీలన్నీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూల దోరణితో చర్చలు జరగాలని అన్నారు. ముందుకు సాగేందుకు పార్టీలన్నీ సహకరిస్తాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. గత శీతాకాల సమావేశాలు మొత్తం ప్రతిపక్షాల ఆందోళనతోనే ముగిసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications