తల్లీ, కుమార్తె గ్యాంగ్ రేప్: ముఠా నాయకుడి అరెస్టు
లక్నో: తల్లి, కుమార్తై (మైనర్) గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు ముఠా నాయకుడు పోలీసులకు చిక్కాడు. సలీం బవారియాను అరెస్టు చేశామని ఉత్తర్ ప్రదేశ్ డీజీపీ జావేద్ అహమ్మద్ తెలిపారు. ఇప్పటికే నలుగురు అరెస్టు అయ్యారని ఆయన చెప్పారు.
జులై 29వ తేదిన నోయిడా నుంచి షాజహాన్పూర్ ప్రాంతానికి ఓ కుటుంబం కారులో వెలుతున్నది. ఎన్ హెచ్ 91 లో వెలుతున్న సమయంలో నిందితులు వారి కారును అడ్డగించారు. తరువాత తల్లి, కుమార్తెను కారులో నుంచి బయటకు లాగారు.

కుటుంబ సభ్యుల ముందే తల్లీ, కుమార్తెను గ్యాంగ్ రేప్ చేసి అక్కడి నుంచి పరారైనారు. ఈ గ్యాంగ్ రేప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మీద మండిపడ్డాయి.
అలహాబాద్ హై కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి సోమవారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు అక్షింతలు వేసింది. ఇంత జరిగినా ఇప్పటి వరకు హెల్ప్ లైన్ పని చెయ్యకపోవడం విచారకరమని కోర్టు విమర్శించింది. ఆగస్టు 22వ తేదికి కేసు విచారణ వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications