తాజ్‌మహల్ వద్ద పిడకల మంట, బొగ్గు వాడకంపై నిషేధం

లక్నో: దేశంలో ప్రముఖ కట్టడమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ సమీపంలో వంటకోసం మండించే కౌ డంగ్ కేక్స్ (ఆవుపేడతో చేసిన పిడకలు)లపై నిషేధం విధించారు. దీంతోపాటు తాజ్‌మహల్ ప్రాంతం సమీపంలో చిన్న తరహా పరిశ్రమలైన గాజుల తయారీ, స్వీట్‌ల తయారీలో మండించేందుకు ఉపయోగించే బొగ్గుపై కూడా నిషేధం విధించాలని జిల్లా యత్రాంగం యోచిస్తోంది.

వీటి వల్ల వాతావరణంలోకి విడుదలయే గోధుమ, నలుపురంగు కర్భన రేణువుల వల్ల తాజ్‌మహల్ పసుపు రంగును సంతరించుకుంటోందని అమెరికా పత్రికలు పేర్కొన్నట్టు డివిజనల్ కమిషనర్ ప్రదీప్ భట్నాగర్ తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణ పరిధిలో పిడకల వాడకంపై నిషేధం విధించినట్టు తెలిపారు.

Burning of Cow Dung Cakes, Coal Banned Near Yellowing Taj Mahal

అయితే పిడకల వాడకం నిషేధాన్ని అమలు చేయడం చాలా కష్టమైన పని అని చెప్పారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన కట్టడాన్ని పరిరక్షేందుకు పిడకలను ఉపయోగించే వారిపై నగర్ నిగమ్ చట్టం ప్రకారం జరిమానా విధిస్తామని చెప్పారు.

నిరుపేదలు వంటచెరుకుగా ఉపయోగించుకునే పిడకలపై నిషేధం విధిస్తే వారికి ఇబ్బందులు ఎదురవుతాయని ప్రశ్నించగా.. వారికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తామని ఆయన తెలిపారు. తాజ్‌మహల్ సమీపంలో తిరుగుతున్న 4వేలకు పైగా డీజిల్ ట్రక్కులను జులైలోగా సిఎన్‌జికి మార్చుకోవాలని యజమానులను కోరినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+