నదిలో పడిన పెళ్లి బృందం బస్సు: 22మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు వంతెన నుంచి నదిలో బోల్తాపడి సుమారు 22 మంది మృత్యువాత పడ్డారు. మరో 10మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.
పెళ్లి బృందం చిన్న బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. బస్సులో చాలా మంది ఇరుక్కుపోయారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Chief Minister Shivraj Singh Chouhan has announced a compensation of Rs. 2 lakh to the kin of deceased & the injured will get compensation of Rs. 50,000: Dilip Kumar, Collector, #Sidhi
— ANI (@ANI) April 17, 2018
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.
మృతుల కుటుంబాలకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాను రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.












Click it and Unblock the Notifications