బెంగళూర్ బస్సులో యువతిపై అత్యాచారయత్నం

బెంగళూర్ సిటీ బస్సు పుష్పక్‌లో ప్రయాణిస్తున్న ఓ యువతిపై బస్సు కండక్టర్ కమ్ డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 38 ఏళ్ల బస్సు డ్రైవర్ సిద్ధార్థను పోలీసులు అరెస్టు చేసి ఆదివారంనాడు న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అతన్ని ఈ నెల 29వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు.
ఈ నెల 13వ తేదీ రాత్రి పది గంటల ప్రాంతంలో మెజిస్టిక్ నుంచి బనశంకరి మధ్య నడిచే పుష్పక్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న పంజాబీ యువతి ఎక్కింది. ఆమెతో పాటు 15 మంది ప్రయాణికులున్నారు. వారంతా మధ్యలో దిగిపోయారు.
ఆ తర్వాత రోడ్డు పక్కన డ్రైవర్ బస్సును ఆపాడు. లైట్లు ఆర్పేసి యువతిపై అత్యాచారానికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత బస్సును రామరాజుపేట ప్రాంతంలో వదిలేసి పారిపోయాడు. కెంపగౌడ వైద్య కళాశాల ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications