భార్య, కొడుకు హత్య: రియల్ వ్యాపారి ఆత్మహత్య

ఉజ్జయిని: వ్యాపారంలో నష్టం రావడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యాపారవేత్త తన కుటుంబ సభ్యులను హత్య చేసి అతనూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో జరిగింది.

ఉజ్జయిని నగరంలో సతీష్ సైని అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో పలు చోట్ల అప్పులు చేశాడు. సతీష్ దగ్గర రుణం తీసుకున్న వారు సరైన సమయంలో తిరిగి ఇవ్వలేదు.

Business man kills wife and son, hangs himself to death in Madhya Pradesh

తనకు రావాలసిన నగదు రాకపోవడం, అప్పులు ఇచ్చిన వారు వేదించడంతో జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే భార్య, కొడుకును అప్పులు ఇచ్చిన వారు వేధింపులకు గురి చేస్తారని సతీష్ భయపడ్డాడు.

తరువాత భార్య, కుమారుడిని హత్య చేసిన సతీష్ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు వెళ్లి చూడగా మంచం మీద భార్య, కుమారుడి మృతదేహాలు పడిఉన్నాయని, సతీష్ మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతున్నదని పోలీసులు చెప్పారు. భార్య, కుమారుడి మృతదేహాలు నీలం రంగులో ఉన్నాయని, సతీష్ వారిద్దరికి విషం ఇచ్చి హత్య చేసి ఉంటాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+