Businessman: పక్కరూమ్ లో భార్య, రియల్ ఎస్టేట్ వ్యాపారిని నరికి చంపేసి ?, దుబాయ్ రిటన్ !
బెంగళూరు/బెళగావి: దుబాయ్ లో వ్యాపారం చేసిన వ్యక్తి డబ్బులు బాగా సంపాధించాడు. కరోనా వైరస్ దెబ్బతో దుబాయ్ నుంచి సొంత ఊరు వచ్చిన అతను తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి అతను విలాసవంతమైన భవనంలో నివాసం ఉంటున్నాడు. భార్య, పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని అతి దారుణంగా నరికి చంపేశారు.
కర్ణాటకలోని బెళగావి సిటీలో సుధీర్ కాంబళ అలియాస్ సుధీర్ (57) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి సుధీర్ దుబాయ్ లో వ్యాపారం చేస్తున్నాడు. దుబాయ్ లో వ్యాపారం చేసిన సుధీర్ భారీగా డబ్బులు సంపాధించాడు. కరోనా వైరస్ దెబ్బతో రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ నుంచి బెళగావి వచ్చిన సుధీర్ తరువాత అక్కడే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.

శుక్రవారం భార్య, పిల్లలతో కలిసి బయటకు వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉల్లాసంగా గడిపాడని తెలిసింది. రాత్రి భార్య, పిల్లలు ఒక రూమ్ లో నిద్రపోవడంతో మరో రూమ్ లోకి సుధీర్ వెళ్లాడు. అర్దరాత్రి దాటిన తరువాత కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సుధీర్ ఇంట్లోకి వెళ్లారు. భార్య, పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలోనే సుధీర్ ను అతి దారుణంగా హత్య చేశారు.
సుధీర్ ను హత్య చేసిన తరువాత నిందితులు తప్పించుకుని పారిపోయారు. శనివారం ఎంతసేపు అయినా సుధీర్ రూమ్ లో నుంచి బయటకు రాకపోవడంతో అతని భార్య వెళ్లి చూడగా హత్య జరిగిన విషయం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్ లావాదేవీల కారణంగా హత్య జరిగిందా ?, మహిళ విషయంలో హత్య జరిగిందా అంటూ కేసు విచారణ చేస్తున్నామని బెళగావి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications