బెంగళూరు సెంట్రల్ జైలుకు శశికళ: జైలుకు పంపించిన లాయర్ ఈయనే !
తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని వారం రోజుల నుంచి ఒంటికాలి మీద నిలబడి నానా హంగామా చేసిన శశికళ ఇప్పుడు బెంగళూరు నగరంలోని పరప్పన అగ్రహార 'సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించడానికి సిద్దం అయ్యారు.
చెన్నై/బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని వారం రోజుల నుంచి ఒంటికాలి మీద నిలబడి నానా హంగామా చేసిన శశికళ నటరాజన్ ఇప్పుడు బెంగళూరు నగరంలోని పరప్పన అగ్రహార 'సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించడానికి సిద్దం అయ్యారు.
సుప్రీం కోర్టు తీర్పుతో షాక్ కు గురైన శశికళ చట్టాన్ని గౌరవించి పోలీసుల ముందు లొంగిపోవాలి. లేదంటే పోలీసులే బలవంతంగా శశికళను అరెస్టు చేసి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

సుప్రీం కోర్టు సంచలన తీర్పుతో శశికళ నాటరాజన్ తో సహ ఇళవరసి, దివాకరన్ లు ఇప్పుడు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాలని జయలలిత అక్రమాస్తుల కేసును కర్ణాటక ప్రభుత్వం తరుపున మొదటి నుంచి వాదిస్తున్న సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ బీవీ. ఆచార్య మీడియాకు చెప్పారు. ఎంతో ప్రభావితం చేసే వ్యక్తులైనా సరే భారత న్యాయవ్యవస్థ ముందు అందరూ సమానమే అని ఆచార్య అన్నారు.
అక్రమాస్తుల కేసు లెక్కలు సరిగా లేవనే ఒక్క ఆరోపణతోనే జయలలిత అక్రమాస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టి వేసిందని మాజీ అడ్వకేట్ జనరల్ ఆచార్య గుర్తు చేశారు. కర్ణాటక హై కోర్టు తీర్పుతో జయలలిత, శశికళ, ఇళవరసి, దివాకరన్ లు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల అయ్యారని ఆచార్య అన్నారు.
ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో శశికళ, ఇళవరసి, దివాకరన్ లు మళ్లీ జైలుకు వెళ్లాలని బీవీ. ఆచార్య మీడియాకు చెప్పారు. జయలలిత అక్రమాస్తుల కేసును కర్ణాటక ప్రభుత్వం తరుపన సుప్రీం కోర్టులో బీబీ. ఆచార్య వాదించారు. శశికళకు శిక్షపడటంలో ఎప్పటికైన న్యాయం గెలుస్తోందని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది బీబీ. ఆచార్య మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications