ఘోరం: తోటి జవాన్లపై మరో జవాన్ కాల్పులు, నలుగురు మృతి
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జవాను తోటి జవాన్లపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.

బాసుగూడలోని సీఆర్పీఎఫ్ సీక్యాంపు 168 బెటాలియన్‌కు చెందిన శాంత్ కుమార్ అనే కానిస్టేబుల్ ఇన్సాస్ రైఫిల్‌తో విచక్షణా రహితంగా కాల్పులకు దిగాడు. దీంతో విక్కీ శర్మ, గజానంద్, రజ్వీర్ సింగ్, శంకర రావు, మేఘ్ సింగ్ అనే నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృత్యువాతపడగా మరొకరు గాయపడ్డారు.

అయితే, శాంత్ కుమార్ ఈ ఘోరానికి ఎందుకు తెగబడ్డాడనే విషయం తేలాల్సి ఉంది. వీరి మధ్య చోటు చేసుకున్న ఘర్షణే ఈ కాల్పులకు దారితీసిందా? లేక మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలున్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications