C-Voter survey: యూపీ మళ్లీ బీజేపీ ఖాతాలోనే కానీ, పంజాబ్‌లో హోరాహోరీ

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏబీపీ-సీఓటర్ సర్వే అంచనాలు విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు 2022 అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీతోపాటు దాని భాగస్వాముల గెలుపు కష్టసాధ్యమని సీఓటర్ సర్వే తేల్చింది.

యూపీ, పంజాబ్ ఎన్నికలే కీలకం

యూపీ, పంజాబ్ ఎన్నికలే కీలకం

అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉ్న బీజేపీ తన అధికారాన్ని మరోసారి నిలబెట్టుకుంటుందని సర్వే వెల్లడించింది. కానీ, సుమారు 100 సీట్ల వరకు కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. ఇక పంజాబ్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్, దాని మిత్రపక్షాలు ఖాతా తెరిచే అవకాశం కూడా కష్టమేనని అంచనా వేసింది. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉండనున్నట్లు పేర్కొంది. ఏ పార్టీకి కూడా మెజార్టీ వచ్చే అవకాశం లేదని తెలిపింది. మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని ఈ సర్వేను లక్ష మందికిపైగా అభిప్రాయాలను తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో మరోసారి బీజేపీకే పట్టం, కానీ..

ఉత్తరప్రదేశ్‌లో మరోసారి బీజేపీకే పట్టం, కానీ..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని భాగస్వాములు మరోసారి అధికారాన్ని దక్కించుకుంటాయని సీ-ఓటర్ సర్వే తేల్చి చెప్పింది. అయితే, సుమారు 108 స్థానాలో కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీ కూటమి 217కుపైగా స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ 156 సీట్లు, బీఎస్పీ 18 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకు పరిమితం కానున్నాయి. బీజేపీ కూటమికి 40.7 శాతం ఓట్లు, ఎస్పీకి 31.1 శాతం ఓట్లు, బీఎస్పీకి 15.1 శాతం ోట్లు, ఐఎన్‌సీకి 8.9 శాతం ఓట్లు రానున్నాయి. బీజేపీ కూటమికి 213-221 సీట్లు వచ్చే అవకాశం ఉండగా, ఎస్పీకి 152-160 సీట్ల మేర సీట్లు దక్కించుకోనున్నాయని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, ఎస్పీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. 60 సీట్ల తేడాతో బీజేపీ మరోసారి అధికారం దక్కించుకోనుందని సర్వే తేల్చింది.

పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్-ఆప్ మధ్య హోరా హోరీ

పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్-ఆప్ మధ్య హోరా హోరీ

వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుందని సీఓటర్ సర్వే స్పస్టం చేసింది. బీజేపీ, దాని భాగస్వామ్ పార్టీలు ఒక్క సీటు కూడా దక్కించుకునే అవకాశం లేదని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 46 సీట్లు, ఎస్ఏడీ 20, ఏఏపీ(ఆప్)కి 51 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి 34.9 శాతం ఓట్లు, ఎస్ఏడీకి 20.6 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 36.5 శాతం ఓట్లు, బీజేపీకి 2.2 శాతం ఓట్లు రానున్నాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 42-50 మధ్య, ఆమ్ ఆద్మీ పార్టీకి 47-53 మధ్య సీట్లు రానున్నాయని అంచనా వేసింది.

ఉత్తరాఖండ్‌లోనూ మళ్లీ బీజేపీనే?

ఉత్తరాఖండ్‌లోనూ మళ్లీ బీజేపీనే?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. అయితే, మెజార్టీ మార్కుకు దగ్గర నిల్చిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ 38 సీట్లను సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 32, ఆప్, ఇతరులకు ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ అధికారం ఏర్పాటు.

బీజేపీకి 41.1 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 36.3 శాతం ఓట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 11.8 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

గోవా మళ్లీ బీజేపీ ఖాతాలోనే..

గోవా మళ్లీ బీజేపీ ఖాతాలోనే..

గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ తన హవాను కొనసాగించనుందని సీఓటర్ అంచనా వేసింది. బీజేపీ ఈ ఎన్నికల్లో 21 స్థానాలు దక్కించుకోనుందని, ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 5, కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీకి 35.7 శాతం ఓట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 23.6 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 18.6 శాతం ఓట్లు రానున్నాయి. కాగా, 2017లో కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు రావడం గమనార్హం.

మణిపూర్ ఎన్నికల్లోనూ బీజేపీ హవా..

మణిపూర్ ఎన్నికల్లోనూ బీజేపీ హవా..

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ తన హవాను కొనసాగించనుంది. సీఓటర్ సర్వే ప్రకారం.. బీజేపీ సునాయాస విజయం సాధిస్తుంది. బీజేపీకి 25-29 సీట్లు వచ్చే అవకాశం ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 20-24, నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు 4-8 స్థానాలు, ఇతరులకు 3-7 స్థానాలు దక్కేవ అవకాశం ఉంది. మణిపూర్ అసెంబ్లీలో 60 స్థానాలున్నాయి. బీజేపీకి 38.7 శాతం ఓట్లు రాబట్టే అవకాశం ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 33.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+