క్యాబీపై తుపాకి గురిపెట్టి మహిళ పట్ల అసభ్యంగా..

దుండగులు దాడులకు పాల్పడిన ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. గత ఆదివారం రాత్రి ఇద్దరు మహిళలు ఎల్లో టాక్సీలో తమ ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు కారు ఆపి లోపలికి వెళ్లారు. కారు డ్రైవర్ తలపై తూపాకీ పెట్టి తాము చెప్పినట్లుగా కారును నడపాలని బెదరించారు.
తుపాకీ తలకు పెట్టడంతో టాక్సీ డ్రైవర్ దుండగులు చెప్పినట్లుగా దాదాపు 20నిమిషాలుపాటు ప్రయాణించారు.డ్రైవర్ ధైర్యం ప్రదర్శించి ప్రజలు ఎక్కువగా ఉండే రాజబజార్‌లోని బక్రి మార్కెట్ వద్ద కారును సడన్ బ్రేక్ వేసి ఆపాడు. ఆ యువకులను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ అప్రమత్తతను గ్రహించిన మహిళలు అరుపులు పెట్టడంతో దగ్గరలో ఉన్న ప్రజలు కారువైపు పరుగెత్తుకుంటూ వచ్చారు. అది గమనించిన దుండగులు అక్కన్నుంచి పారిపోయారు.
సెప్టెంబర్ 6న కోలఘాట్ దగ్గర 6వ నెంబరు జాతీయ రహదారిపై మహిళలు ప్రయాణిస్తున్న కారు నిలిపివేయించారు. ఇద్దరు మహిళలను బయటికి తీసుకొచ్చి వారిపై ఖాళీ బీరు సీసాలతో దాడి చేశారు. కొన్ని రోజుల క్రితం ఆ ముగ్గురు దుండగులు బైకుపై వెళుతూ ఏజెసి బోస్ రోడ్‌లో సంచరిస్తున్న దంపతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.
కాగా సోమవారం నిందుతులలో ఒకరైన మహ్మద్ దులేరా అలియాస్ టిపును పోలీసులు అరెస్ట్ చేసి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు మహ్మద్ అస్లం(హబ్లు), మహ్మద్ హన్సేన్ (షమీమ్)లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందుతులు ముగ్గురూ నార్కెల్డంగలో నివాసం ఉంటున్నట్లు, వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications