Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐదు గ్యారెంటీల హామీలు, అందరి చూపు సీఎం మీదే, ఏం చెబుతారో అని టెన్షన్ !

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలను ఊహించని మలపు తిప్పిన కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీ పథకాల అమలుకు కౌంట్ డౌన్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఈరోజు శుక్రవారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో పూర్తి సమాచారం చెప్పనున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిద్దరామయ్య సమాధానం కోసం కర్ణాటక ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హైవోల్టేజీతో కూడిన ప్రభుత్వ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరగనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్ భేటీపై రాష్ట్ర ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహ లక్షి పథకం కింద ప్రతి గృహిణికి నెలకు రూ. 2, 000 అందిస్తామని హామీలు ఇచ్చారు.

Cabinet ministerial meeting, CM Siddaramaiah giving clarity on five guarantees

సహాయధన్ , అన్నభాగ్య పథకం కింద ప్రతి బీపీఎల్ కుటుంబానికి 10 కిలోల ఉచితంగా బియ్యం పంపిణ, యువనిధి పథకం కింద నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 3, 000. డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగులకు రూ. 1,500 సహాయం అందిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కన్నడిగులకు హామీలు ఇచ్చింది. కర్ణాటక రాష్ట్ర ఆర్ టీసీ బస్సుల్లో కర్ణాటక వ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి కేబినెట్‌లో ఐదు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ నేతలు సహా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు వాగ్దానం చేశారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం తొలి కేబినెట్‌లో సూత్రప్రాయ ఈ హామీలకు అంగీకారం ఇచ్చింది. ఇప్పటికే ఆర్థిక శాఖతో చర్చించిన ప్రభుత్వం గృహజ్యోతి, గృహలక్ష్మి, అన్నభాగ్య, యువనిధి, శక్తి హామీలను ఏకకాలంలో అమలు చేస్తారా? లేదా ఆర్థిక వ్యవస్థను అంచనా వేసి విడతలు విడతలుగా అమలు చేస్తారా అని ఈ రోజు కేబినెట్ సమావేశం పూర్తి అయ్యే వరకు వేచి చూడాలి.

Cabinet ministerial meeting, CM Siddaramaiah giving clarity on five guarantees

ఇప్పటికే ఆర్థిక మంత్రిగా, సీఎంగా పరిపాలనా అనుభవం ఉన్న సిద్ధరామయ్యకు ఈ ఐదు హామీల ప్రకటన అతిపెద్ద సవాల్ అని, ఐదు హామీల్లో మొదటి దశలో మూడు హామీలు మాత్రమే అమలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు. అయితే ఈ రోజు సీఎం సిద్దరామయ్య ఏం చెబుతారో అని వేచి చూడాలి.

మహిళా శక్తి పథకం కింద రాష్ట్ర ఆర్ టీసీ బస్సులలో కర్ణాటక అంతటా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది, కాబట్టి అనేక కిలోమీటర్ల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. అయితే మహిళలు ప్రయాణించడానికి ఇన్ని కిలోమీటర్లు మాత్రమే అనే పరిమితి విధించే అవకాశం ఉందని తెలిసింది.

రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులను నిర్దేశిత గుర్తింపు కార్డు ద్వారా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇంకా 3. 5 కోట్ల మంది మహిళలు మహిళా శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం పొందేద అవకాశం ఉంది. మహిళలు ఆర్ టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తే ప్రతి ఏటా రూ. 3, 600 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ మొత్తం వ్యయం ప్రభుత్వం భరించాలని అధికారులు అంచనా వేశారని తెలిసింది.

ప్రతి బీపీఎల్ కుటుంబానికి అన్నభాగ్య పథకం కింద 10 కిలోల ఉచిత బియ్యం అందించాలి. పాత నిబంధనలను సవరించి జూన్‌ నుంచే ఈ పథకం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఉచిత విద్యుత్ హామీ గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే 200 యూనిట్లలోపు నెలవారీ విద్యుత్ వినియోగం ఉచితం కాని బిల్లు కట్టాలని, తరువాత ఈ పథకం కింద లబ్ధిదారుని ఖాతాకు నేరుగా నిధుల బదిలీ అవుతుందని అధికారులు అంటున్నారు. అయితే ఈ రోజు సీఎం సిద్దరామయ్య ఎలాంటి ప్రకటన చేస్తారో ? అని అందరూ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+