5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు: మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల వేళ మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ టీఎంసీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కోల్‌కతా హైకోర్టు.. తాజాగా బుధవారం మరో సంచలన తీర్పును వెలువరించింది. ఓబీసీలో పలు క్లాసులను కొట్టివేసింది.
అంతేగాక, తృణమూల్ కాంగ్రెస్ (TMC) హయాంలో2010 సంవత్సరం తర్వాత నుంచి జారీ చేసిన ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత 14 వ్యవధిలో జారీ అయిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లన్నీ రద్దయ్యాయి.

అయితే, ఓబీసీ సర్టిఫికెట్లను వాడుకొని ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిపై, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఈ ఆదేశాల ప్రభావం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారంతా ఓబీసీ కోటాలోనే కొనసాగుతరాని వెల్లడించింది. పశ్చిమబెంగాల్ బీసీ కమిషన్ చట్టం - 1993 ప్రకారం ఓబీసీల కొత్త జాబితాను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కొత్త జాబితాను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాలని హైకోర్టు నిర్దేశించింది. 2010కి ముందు బెంగాల్ ఓబీసీల జాబితాలో ఉన్న కేటగిరీలలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేసింది. 2010 సంవత్సరం తర్వాత రాష్ట్ర సర్కారు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు 1993 చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ తపోబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంథర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
2012 నాటి పశ్చిమబెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని నిబంధనలు చట్ట విరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపింది హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం. 2010-12 మధ్య బెంగల్ ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఆ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు బెంచ్
స్పష్టం చేసింది.
కోర్టు తీర్పుపై మమతా బెనర్జీ అసహనం
హైకోర్టు తీర్పుపై బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని తాము అంగీకరించబోమన్నారు. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి బిల్లు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. రాజ్యాంగానికి లోబడి తీసుకొచ్చిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించిందన్నారు. ఇప్పుడు బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి దీన్ని నిలిపివేయాలని కుట్ర పన్నిందంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ తీర్పును తాము అంగీకరింబోమన్న మమతా బెన్జీ.. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications