సీఎం గా కాదు, ఒక స్వచ్చంద కార్యకర్తగా వచ్చాను .. రైతులకు మద్దతుగా, నిరసన దీక్షల వద్ద అరవింద్ కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు ఢిల్లీలో ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపినా చర్చలు సఫలం కాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. చలో ఢిల్లీ పేరుతో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్న సమయంలో ఢిల్లీ హర్యానా సరిహద్దును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు సందర్శించారు . మొదటి నుండి తన మద్దతు ప్రకటించిన ఢిల్లీ సీఎం దీక్షా శిబిరాల వద్ద ఢిల్లీ ప్రభుత్వం వారి కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు .
నిరసన దీక్షల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
సింఘూ వేదిక వద్ద నిరసన దీక్షలను సందర్శించిన సందర్భంగా కేజ్రీవాల్ తన క్యాబినెట్ మంత్రులు మరియు కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. తాము రైతుల అన్ని డిమాండ్లకు మద్దతు ఇస్తున్నామని , వారి సమస్య మరియు డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం సత్వరం పరిష్కరించాలని, తమ పార్టీతో పాటు తాము కూడా మొదటి నుండి రైతులతోకలిసి ఉన్నామని పేర్కొన్నారు. రైతుల నిరసనల ప్రారంభంలో, తొమ్మిది స్టేడియాలను జైళ్లుగా మార్చడానికి ఢిల్లీ పోలీసులు అనుమతి కోరినా నిరాకరించామని గుర్తు చేశారు .
సీఎం గా కాదు, ఒక స్వచ్చంద కార్యకర్తగా వచ్చా .. అరవింద్ కేజ్రీవాల్
తనపై ఒత్తిడి వచ్చినప్పటికీ రైతుల నిరసన కు తాము పూర్తిగా మద్దతు తెలుపుతూ పోలీసులు విజ్ఞప్తిని తిరస్కరించామని నిరసన వేదికను సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ అన్నారు.
మా పార్టీ, ఎమ్మెల్యేలు మరియు నాయకులు రైతులకు స్వచ్చంద సేవకులు గా సేవ చేస్తున్నారని పేర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ తాను ఇక్కడకు సిఎంగా రాలేదని తానూ ఒక స్వచ్చంద కార్యకర్తగా వచ్చానని చెప్పారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పిన ఆయన మేము వారికి అండగా నిలబడాలనే ఆప్ తరపున మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు.

రేపు భారత్ బంద్ .. సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఢిల్లీ సీఎం
డిసెంబర్ 8 భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతుగా తమ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఇందులో పాల్గొంటారు అని ఆయన అన్నారు.
"భారత్ బంద్" కు మద్దతునిచ్చిన పలువురు ప్రతిపక్ష నాయకులలో కేజ్రీవాల్ కూడా ఉన్నారు. పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల నుండి వచ్చిన రైతులు10 రోజులకు పైగా సింఘూ మరియు తిక్రీ సరిహద్దులలో శాంతియుత నిరసనలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఖాజీపూర్ సరిహద్దు వద్ద కూడా ఆందోళన చేస్తున్న రైతుల సంఖ్య పెరిగిందని , ఉత్తరప్రదేశ్ నుండి ఎక్కువ మంది నిరసన ఉద్యమంలో చేరారని సమాచారం.
Recommended Video

మరోమారు చర్చలు .. అయినా సరే మిన్నంటుతున్న నిరసనలు
కేంద్రం యొక్క కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తున్న రైతులు ఇప్పటి వరకు ఐదు దఫాలుగా చర్చలు జరిపినా కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలవంతం కాలేదు. దీంతో మరోమారు ఆరవ రౌండ్ చర్చలకు అంగీకరించారు రైతులు. ఆరోగ్య పై చర్చలు బుధవారం జరగాల్సి ఉంది . కేంద్ర చర్చల బృందంలో భాగమైన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, అంతర్గత చర్చలకు ప్రభుత్వానికి ఎక్కువ సమయం అవసరమని రైతులకు చెప్పారు . వచ్చే వారం జరిగే సమావేశంలో తాజా ప్రతిపాదనను ప్రవేశపెడతామని చెప్పారు.
కానీ రైతులు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని భీష్మించుకు కూర్చుంటే ప్రభుత్వం వ్యవసాయ చట్టాల అమలుకే మొగ్గు చూపుతుంది .
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications