ఓటు వేయకుంటే ప్రశ్నించే హక్కు ఎక్కడిది?: తేల్చేసిన సుప్రీం
ఓటు హక్కును వినియోగించుకోనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా ఉండదని సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
న్యూఢిల్లీ: ఓటు హక్కును వినియోగించుకోనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా ఉండదని సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దేశవ్యాప్తంగా రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురి అవుతున్నాయని, వీటి తొలగింపునకు ఆదేశాలివ్వాలని దానేశ్ లెష్‌ధన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. 'మీరు ఎప్పుడైనా ఓటు వేశారా?' అని పిటిషనర్‌ను ప్రశ్నించింది ధర్మాసనం. దీనికి స్పందించిన దానేశ్ తానెప్పుడూ ఓటు వేయలేదని తెలిపాడు.

దీంతో తీవ్రంగా స్పందించిన ధర్మాసనం ఓటు హక్కును ఉపయోగించుకోనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిందించడం కుదరదని, అసలు ఆ హక్కు మీకు లేదని తేల్చి చెప్పింది.ఆక్రమణల తొలగింపుపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని, రాష్ట్రాల్లోని హైకోర్టులను ఆశ్రయించాలని సూచించింది.
'మీరు ఒకవేళ హైకోర్టులను ఆశ్రయించకుంటే కేవలం ప్రచారం కోసమే ఇక్కడికి వచ్చారని భావించాల్సి వస్తుంది' అని పేర్కొంది. తాము ఆదేశాలు జారీ చేయగానే అన్ని పనులైపోతాయని అనుకోవద్దని తెలిపింది. తమకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications