వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమ పెళ్ళిళ్ళు అక్కడ నిషేధం, గ్రామ బహిష్కరణ, ఎందుకో తెలిస్తే షాక్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రేమిస్తే ఆ గ్రామంలో గ్రామం నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా జిల్లాలోని ఛాన్‌కోయిన్ గ్రామస్థులు ఈ మేరకు ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ గ్రామంలో ప్రేమ పెళ్ళిళ్ళను నిషేధించారు.ఈ నిర్ణయాన్ని కాదని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొంటే గ్రామం నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు.

ప్రేమించాను పెళ్ళి చేసుకొంటానని ఆ గ్రామంలో గ్రామ బహిష్కరణ తప్పదు. ప్రేమ పెళ్ళిళ్ళు గ్రామ పెద్దలకు నచ్చడం లేదు. ఈ విషయమై మూకుమ్మడిగా సమావేశమై ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే గ్రామ బహిష్కరణకు సిద్దం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.

ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొంటే గ్రామ బహిష్కరణ

ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొంటే గ్రామ బహిష్కరణ

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా జిల్లాలోని ఛాన్‌కోయిన్ గ్రామ పెద్దలు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ప్రేమ పేరు విన్పిస్తేనే ఈ గ్రామ పెద్దలు కోపంతో ఊగిపోతున్నారు. ప్రేమ పేరుతో షికార్లు చేసినా, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని ఆ గ్రామ పెద్దలు నిషేధం విధించారు. ఈ కట్టుబాటును కాదని పెళ్ళిళ్ళు చేసుకొంటే సామాజిక బహిష్కరణ చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకొన్నారు.

ఈ నిర్ణయానికి కారణమిదే

ఈ నిర్ణయానికి కారణమిదే

ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదిన ప్రేమ పేరుతో ఓ జంట కులాంతర వివాహం జరిగింది. దీంతో గ్రామ పెద్దలు సహించలేకపోయింది. ప్రేమ పేరుతో కులాంతర వివాహలను ప్రోత్సహిస్తున్నాయనే కారణంగా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోంటే గ్రామం నుండి బహిష్కరించాలని గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకొన్నారు.

గ్రామ బహిష్కరణలో తప్పేం లేదు

గ్రామ బహిష్కరణలో తప్పేం లేదు

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా జిల్లా ఛాన్‌కోయిస్ గ్రామంలో ప్రేమ పెళ్ళిళ్లు చేసుకొంటే గ్రామం నుండి బహిష్కరణ చేయాలని తీసుకొన్న నిర్ణయంలో తప్పేమీ లేదని గ్రామపంచాయితీ సభ్యుడు ప్రకటించారు. గ్రామానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్టుగా వారు చెప్పారు. ఈ నిర్ణయానికి గ్రామం కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన చెప్పారు.

గ్రామం నుండి బహిష్కరిస్తే చర్యలు తప్పవు

గ్రామం నుండి బహిష్కరిస్తే చర్యలు తప్పవు

ప్రేమ పెళ్ళిళ్ళపై నిషేధం ఉన్న విషయం తమ దృష్టికి రాలేదని జిల్లా అధికారులు చెప్పారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొన్నారనే కారణంగా గ్రామం నుండి బహిష్కరిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని అధికారులు ప్రకటించారు.

English summary
After two youngsters who lived in neighbouring houses at Chankoian Khurd village in Doraha married for love, the enraged panchayat passed a resolution banning love marriages. Not content with that, they also pasted an order asking residents to socially boycott the family at several places in the village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X