ఇప్పుడే 10వేలకోట్లు ఇవ్వలేం: సుబ్రతపై సుప్రీంకి సహారా

Can't pay Rs.10,000 cr to bail out Subrata: Sahara tells SC
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ యజమాని సుబ్రతా రాయ్ బెయిల్ విషయంలో ఆ సంస్థకు న్యాయస్థానంలో చుక్కెదురయింది. సుబ్రతా బెయిల్ కోసం తక్షణం రూ.2,500 కోట్లు చెల్లిస్తామని సుప్రీం కోర్టుకు సహారా సంస్థ గురువారం ప్రతిపాదించింది. ఆయన విడుదలయిన తర్వాత మిగతాది చెల్లిస్తామని తెలిపింది.

ఈ ప్రతిపాదలను కోర్టు తిరస్కరించింది. దాంతో సుబ్రతా విడుదలకు సహారా చేసిన యత్నం విఫలమైంది. మొదట రూ.2,500 కోట్లు చెల్లిస్తామని, సుబ్రతా బయటకు వచ్చిన తర్వాత రూ.25 వేల కోట్లు డిపాజిట్ చేస్తామని సహారా గ్రూప్ ప్రతిపాదించింది. దానికి న్యాయస్థానం అంగీకరించలేదు.

కాగా, సహారా గ్రూప్ యజమాని సుబ్రతా రాయ్‌కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వారం రోజుల క్రితం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కావాలంటే పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆయనను ఆదేశించింది.

ఐదువేల కోట్ల రూపాయల నగదు, మరో ఐదువేల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారెంటీ చూపించాలని సుప్రీం కోర్టు సుబ్రతా రాయ్‌ను ఆదేశించింది. జస్టిస్ కెఎస్ రాధాకృష్షణ్, జస్టిస్ జెఎస్ ఖేహర్‌లతో కూడిన ధర్మాసనం సుబ్రతా రాయ్‌కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది.

అదే సమయంలో స్తంభింప చేసిన బ్యంకు ఖాతాలను డీఫ్రీజ్ చేసేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. సహారా కంపెనీకి సంబంధించిన ఏఏ బ్యాంకు అకౌంట్లను డీఫ్రీజ్ చేయాలో ఆ అకౌంటు నెంబర్లు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనంతరం కేసును ఈ రోజుకు (గురువారానికి) వాయిదా వేసింది. అయితే, సహారా ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది. సుబ్రతా రాయ్ మార్చి 4 నుండి జైలులో ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+