బ్రహ్మపుత్ర నది జలాల సమాచారాన్ని ఇవ్వలేం: చైనా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో పంచుకోవడం కుదరదని చైనా తేల్చి చెప్పింది.డోక్లామ్ ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాలు సమస్యల పరిష్కారానికి చర్చలను వేదికగా ఉపయోగించుకొంటున్నాయి.అయితే చైనా మాత్రం తన వక్రబుద్దిని మాత్రం మార్చుకోవడం లేదు.

భారత్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని చైనా ప్రకటించింది.డోక్లామ్ సమస్య ఉత్పన్నమైన సమయంలో సిక్కిం సరిహద్దులో మూసేసిన నాథూలా పాస్‌ను తిరిగి తెరిచేందుకు సిద్దమని చైనా తెలిపింది.

Can't share Brahmaputra data for now; ready for talks to reopen Nathu La pass: China

అయితే ఈ విషయమై భారత్ ముందుకు రావాల్సిన అవసరం ఉందని చైనా అభిప్రాయపడింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు.

నాథూలా పాస్‌ను తిరిగి తెరిస్తే కైలాస్ మానస సరోవర యాత్ర చేసే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.బ్రహ్మపుత్ర నదీ జలాలకు సంబందించిన సమాచారం కోసం భారత్‌ను ఎన్నిసార్లు అభ్యర్థించినా స్పందించలేదన్నారాయన. దీంతో తాము కూడ నదీజలాల సమాచారాన్ని అందివ్వలేమని ఆయన ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
China on Tuesday said that it cannot share the hydrological data of the Brahmaputra river with India for the time being as the data collection station in Tibet is being upgraded.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి