రేప్ కేసులో స్వామి నిత్యానంద బెయిల్ రద్దు చెయ్యండి, హై కోర్టు నోటీసులు, ఇప్పటికే ఇంటర్ పోల్ కష్టాలు
బెంగళూరు: తాను దేవ మానవుడు అంటూ స్వయంగా ప్రకటించుకున్న వివాదాల స్వామీజీ నిత్యానంద స్వామి అలియాస్ నిత్యానందకు పీకలల్లోతు కష్టాలు ఎదురైనాయి. రేప్ కేసులో నిత్యానందకు ఇచ్చిన బెయిల్ రద్దు చెయ్యాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఇప్పటికే గుజరాత్ లో మైనర్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి నిర్బంధించారని ఆరోపణలు రావడంతో నిత్యానంద దేశం విడిచిపారిపోయారు. నిత్యానంద కోసం ఇప్పటికే ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది.

బెయిల్ రద్దు చెయ్యండి
అత్యాచారం కేసులో నిత్యానందకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చెయ్యాలని లెనిన్ కరుప్పన్ కర్ణాటక హైకోర్టులో అర్జీ సమర్పించారు. రామనగర కోర్టులో జరుగుతున్న ఈ కేసు విచారణ వేరే కోర్టుకు బదిలి చెయ్యాలని లెనిన్ కరుప్పన్ కోర్టుకు మనవి చేశారు. నిత్యానంద స్వామి మాజీ కారు డ్రైవర్ లెనిన్ కరుప్పన్ సమర్పించిన పిటిషన్ శుక్రవారం కర్ణాటక హై కోర్టులో విచారణ జరిగింది. అర్జీ విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జాన్ మైకెల్ కున్హా సీఐడీ అధికారులకు నోటీసులు జారీ చేశారు.

పిటిషన్ లో ఏముందంటే !
నిత్యానంద బెయిల్ షరతులను తుంగలో తొక్కారని లెనిన్ కరుప్పన్ ఆరోపించారు. అత్యాచారం కేసు విచారణకు కోర్టుకు హాజరు కాకుండా నిత్యానంద తప్పించుకుని తిరుగుతున్నారని పిటిషనర్ లెనిన్ కరుప్పన్ ఆరోపించాడు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న నిత్యానంద ఇప్పుడు దేశం విడిచిపారిపోయాడని, అందుకే ఆయన బెయిల్ రద్దు చెయ్యాలని లెనిన్ కరుప్పన్ హై కోర్టుకు మనవి చేశారు.

భక్తురాలిపై అత్యాచారం ?
భక్తురాలిపై అత్యాచారం చేశాడని నిత్యానంద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో 2010లో నిత్యానందను అరెస్టు చేసి రామనగర జైలుకు పంపించారు. తరువాత బెయిల్ మీద బయటకు వచ్చిన నిత్యానంద కేసు విచారణలకు సక్రమంగా హాజరుకావడం లేదని ఆయన మాజీ కారు డ్రైవర్ లెనిన్ కరుప్పన్ ఆరోపించారు. తన మీద నమోదైన అత్యాచారం కేసు కొట్టి వెయ్యాలని నిత్యానంద సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీం కోర్టుకు వెళ్లినా నిత్యానంద మీద నమోదైన అత్యాచారం కేసు రద్దు కాలేదు.

విచారణకు హాజరు కాలేదు, కేసు బదిలి చెయ్యాలి !
నిత్యానందతో పాటు ఆయన ముగ్గురు శిష్యుల మీద అత్యాచారం ఆరోపణలు కేసు నమోదైయ్యింది. ఈ కేసులో నిత్యానంద, ఆయన శిష్యులు కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నారని, అందుకే వారి బెయిల్ రద్దు చెయ్యాలని కారు డ్రైవర్ లెనిన్ కరుప్పన్ కర్ణాటక హై కోర్టులో మనవి చేశారు. అంతే కాకుండా రామనగర కోర్టులో జరుగుతున్న కేసు విచారణ వేరే కోర్టుకు బదిలి చెయ్యాలని కారు డ్రైవర్ లెనిన్ కరుప్పన్ కోర్టుకు మనవి చేశారు. లెనిన్ కరుప్పన్ సమర్పించిన పిటిషన్ విచారణ చేసిన కోర్టు సీఐడీ అధికారులకు నోటీసులు జారీ చేసి సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications