వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్:భారీగా ఉద్యోగాల కోత, ఐటి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి

ఐటి ఉద్యోగుల్లో 65 శాతం మంది ఉద్యోగులు పనికిరారని క్యాప్ జెమిని ఇండియా చీఫ్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రస్తుతం ఉన్న ఐటి ఉద్యోగులు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:డిజిటల్ యుగం వైపుకు వేగంగా అడుగులేస్తోన్న సమాచార సాంకేతిక రంగ ఉద్యోగాలకు మాత్రం ఎసరు పెడుతోంది. డిజిటల్ టెక్నాలజీల వినియోగం పెరుగుతోండడంతో ఐటి పరిశ్రమలో పని ధోరణి కూడ మారుతోంది.ఐటి రంగంలో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో సుమారు 65 శాతం మంది నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నారని క్యాప్ జెమిని ఇండియా చీఫ్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ తరుణంలో ఐటి ఫ్రోఫెషనల్ తమ పని పద్దతులను మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.అయితే నాసిరకం కాలేజీల వల్లే ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో ఐటి ఉద్యోగ నిపుణులు వెనుకబడిపోతున్నారని చెబుతున్నారు. ఐటి రంగంలో ఉన్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఈ ఉద్యోగాలకు పనికి రారనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భారీగా ఐటి ఉద్యోగులకు కోత పడే అవకాశం లేకపోలేదని ఐటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఐటి ఉద్యోగులు తమ పని పద్దతులను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

65 శాతం ఉద్యోగులు పనికిరారు

65 శాతం ఉద్యోగులు పనికిరారు

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పని పద్దతులను మార్చుకొనేందుకు ఐటి రంగంలో పనిచేస్తోన్న సుమారు 65 శాతం ఉద్యోగులు పనిచేయడం లేదని క్యాప్ జెమిని ఇండియా చీఫ్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నారని ఆయన చెప్పారు. ఇదే పరిస్థితులు కొనసాగితే ఉద్యోగుల్లో భారీస్థాయిలో కోతకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ లేదు

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ లేదు

కొత్త తరం టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ కూడ ఇచ్చే పరిస్థితి లేదని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. పరిశ్రమకు ఇది పెద్ద సవాలేనని ఆయన చెప్పారు. ప్రాన్స్ కు చెందిన క్యాప్ జెమినిలో ప్రస్తుతం దేశీయంగా సుమారు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత్ లో పెద్ద సంఖ్యలో ఐటి ఉద్యోగుల కోత ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మళ్ళీ శిక్షణ అవసరం

మళ్ళీ శిక్షణ అవసరం

డిజిటల్ టెక్నాలజీలకు అనుగుణంగా ప్రస్తుతమున్న ఐటి ఉద్యోగుల్లో సుమారు 15 లక్షల మందికి మళ్ళీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తాజాగా పరిశ్రమ చాంబర్ నాస్కామ్ తేల్చి చెప్పింది.అయితే సరైన విద్యా ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన విధ్యార్థులున్నారు.ఈ కారణం వల్ల కూడ ఐటి ఉద్యోగులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను అందిపుచ్చుకొనే అవకాశాలు లేవంటున్నారు.

 ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంచాల్సిందే

ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంచాల్సిందే

ఐటి ఉద్యోగుల్ో నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉందని నాస్కామ్ అభిప్రాయపడింది. సరైన విధ్యా ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల నుండి సుమారు 39 లక్షల మంది ఐటి ఉద్యోగాల్లో చేరారని నాస్కామ్ చెబుతోంది.ఐటిల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లపైనే ఎక్కువగా ఐటి కంపెనీలు కేంద్రీకరిస్తున్నాయి.ఉద్యోగుల నైపుణ్యాలను సానపెట్టేందుకు కేంద్రీకరించడం లేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

నాసిరకం కాలేజీలు కూడ కారణమే

నాసిరకం కాలేజీలు కూడ కారణమే

ఐటి ఫ్రోఫెషనల్స్ కు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను అందిపుచ్చుకోకపోవడానికి నాసిరకంగా కాలేజీలతో పాటు, ఆయా కాలేజీల్లో ఉన్న విద్యా ప్రమాణాలు కూడ కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. నాసిరకం కాలేజీల నుండి ఇప్పుడు ఎక్కువ మంది విధ్యార్థులు ఐటి రంగంలోకి అడుగుపెడుతున్నారు.దరిమిలా వాళ్ళకు జీతాలు పెంచడం వల్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతోందని క్యాప్ జెమిని ఇండియాచీఫ్ శ్రీనివాస్ చెప్పారు. దశాబ్ద కాలం క్రితం ఐటి కంపెనీల్లో కొత్తగా చేరేవారికి రూ.2.25 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసేవారు. ప్రస్తుతం అది కాస్తా రూ.3.5 లక్షలకు మాత్రమే పెరిగింది.

వేతనాల పెరుగుదలలో కూడ కోత

వేతనాల పెరుగుదలలో కూడ కోత

ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొంటే కొత్తగా ఐటి ఉద్యోగాల్లో చేరే వారికి వేతనాలు ఆశించినంతగా పెరగలేదని చెబుతున్నారు. మేదస్సు ఆధారిత పరిశ్రమగా చెప్పుకొనే ఐటి రంగంలో ఉద్యోగులకు ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలను కల్పించడం అతి పెద్ద సవాలేనని చెప్పారు.80 శాతం ఇంజనీరింగ్ పట్టభద్రులు ఈ ఉద్యోగాలకు పనికిరారంటూ అస్పైరింగ్ మైండ్స్ అనే సంస్థ అధ్యయన నివేదక కొద్ది నెలల క్రితమే వెల్లడించింది.ఇదే సమయంలో శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూడ ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

English summary
With the domestic IT (information technology) industry staring at a shift in nature of work due to increasing use of digital technologies, a leading firm has said a majority of the workforce cannot imbibe the required emerging skill-sets, and warned of high job losses at the middle and senior levels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X