కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో బాంబు పేలుడు: ముగ్గురు మృతి
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కారులోని సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కారులోని సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బతిండాలోని మార్‌మండీలో ఇది జరిగింది. చండీగడ్‌కు 200 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్మీందర్ జాస్సీ మాట్లాడుతుండగా సమీపంలోనే జరిగింది. హర్మీందర్ జాస్సీ.. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు దగ్గరి బంధువు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications