ఆర్మీ వైద్యుడి కారు మాయం: ఢిల్లీలో హై అలర్ట్

న్యూఢిల్లీ: ఎన్నడూ లేనంతగా ఈ సారి దేశ రాజధాని పోలీసులు టెన్షన్ పడిపోతున్నారు. గణతంత్ర దినోత్సవం వేడుకలు దగ్గరపడుతున్న సందర్బంలో పోలీసు అధికారులు హడలిపోతున్నారు. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు అధికారులకు గుబులు పుట్టిస్తున్నాయి.

నిఘా వర్గాలు, పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరెగెడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులకు చెమటలు పడుతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటనతో ఢిల్లీ పోలీసులు హడలిపోతున్నారు.

ఓ ఆర్మీ ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కాలక్షేపం చెయ్యడానికి ఢిల్లీలోని లోధి గార్డెన్ కు వెళ్లారు. అతని తెల్లటి సాంత్రో కారు (నెంబర్ హెచ్ఆర్ 51, టీ 6646) కారును అక్కడే పార్క్ చేశారు.

Car with Army sticker stolen from Lodhi Garden in Delhi

కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పార్క్ లోకి వెళ్లారు. తరువాత వచ్చి చూడగా కారు చోరీ అయిన విషయం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు అధికారులు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.

వెంటనే వాట్సాప్ ద్వారా పోలీసు బృందాలకు కారు ఫోటోలు పంపించారు. కారు మీద ఆర్ఆర్ ఆసుపత్రి అనే స్టిక్కర్ ఉందని పోలీసు అధికారులు చెప్పారు. ఉగ్రవాదులే కారును చోరీ చేసి తీసుకు వెళ్లారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+