వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30వేల ఫోన్ కొంటే సబ్బు వచ్చింది, ఫ్లిప్‌కార్ట్‌పై కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఆన్ లైన్ షాపింగ్‌లో ఖరీదైన వస్తువులు కొంటే అప్పుడప్పుడు రాళ్లు, సబ్బులు, ఇతర వస్తువులు వస్తుంటాయి. తాజాగా, ముంబైలో అలాంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది. దీంతో, వినియోగదారుడు సదరు ఆన్‌లైన్ సంస్థ పైన కేసు పెట్టాడు. దీంతో, ముంబైలో కేసు నమోదయింది.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 4 సెల్ ఫోన్‌ను ఆర్డర్ చేస్తే, దానికి బదులు నిర్మా సబ్బు వచ్చింది. దీంతో మలబార్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది.

Case of cheating against Flipkart for delivering soap instead of Samsung phone

వాల్కేశ్కర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ బాలకియా ఈ ఫోన్ ఆర్డర్ చేశాడు. వచ్చిన అట్టపెట్టె తెరిచి చూస్తే అందులో ఫోన్‌కు బదులు సబ్బు ఉంది. ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తు్నన బాలకియా.. వెంటనే విషయాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు తెలిపాడు.

కానీ, అది తప్పుడు ఫిర్యాదు అని సంస్థ కొట్టేసింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో తాను మే 25న ఆర్డర్ చేశానని, అది మే 30వ తేదీన వచ్చిందని, రూ.29,900 చెల్లించి ప్యాక్ తీసుకున్నానని చెప్పారు. కానీ అట్టపెట్టె తెరిచి చూస్తే సబ్బు ఉందని చెప్పాడు.

English summary
The Malabar Hill police in Mumbai have registered a case of cheating against online shopping portal Flipkart for delivering a bar of soap to a customer who had ordered a Samsung Galaxy Note 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X