రెండు మూడు రోజుల్లో నగదు సమస్య పరిష్కారం: జైట్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశంలో అసవరం కంటే ఎక్కువ నగదు చలామణిలో ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఏర్పడిన నగదు సమస్య తాత్కాలికమేనని ఆయన చెప్పారు.

దేశంలో నగదు పరిస్థితిపై సమీక్ష జరిపినట్టు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.ఈ సందర్భంగా మంగళవారం నాడు స్పందించారు. దేశంలో నగదు చలామణి అనుకున్నదానికంటే ఎక్కువగా ఉందన్నారు.

Cash crunch: There is more than adequate currency in circulation, says FM Arun Jaitley

బ్యాంకుల్లో కూడ నగదు అందుబాటులోనే ఉందని చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా నగదు వినియోగం పెరగడం వల్ల కరెన్సీ సమస్య ఏర్పడిందని అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా కరెన్సీ సమస్యపై స్పందించారు.

కరెన్సీ సమస్య విషయమై ఏర్పడిన ఇబ్బందులను త్వరలోనే పరిష్కరించనున్నట్టు ఆయన చెప్పారు. దీన్నిత్వరలోనే పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు ఆర్ధిక మంత్రి సహయమంత్రి శివ‌ప్రతాప్ శుక్లా కూడ దీనిపై స్పందించారు.

కొన్ని రాష్ట్రాల్లో కరెన్సీ సమస్యలు నెలకొన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. దీని కోసం ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో కరెన్సీ సమస్య ఎదుర్కొన్న ప్రాంతాల్లో సమస్య రెండు మూడు రోజుల్లో పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు.

ఏపీ, తెలంగాణ, మహరాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహర్, గుజరాత్ , ఉత్తర్‌ప్రదేశ్ , ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కరెన్సీ కొరత ఏర్పడింది ఏటీఎంలలో నగదు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ సమస్యను పరిష్కారిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Allaying fears of currency shortage in the country, Finance Minister Arun Jaitley on Tuesday said the government has reviewed the situation and "there is more than adequate currency in circulation".

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి