వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ నుంచి ఇలా చేస్తే జైలుకే.. నల్లధనం నిర్మూలనకు కఠిన చట్టం

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒకే లావాదేవీలో రూ.3 లక్షలకు మించి నగదు చేయి మారితే అది పుచ్చుకున్న వ్యక్తి ఆ మొత్తానికి రెట్టింపు జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నల్లధనం, అవినీతి నిర్మూలనకు ప్రధాని నరేంద్రమోడీ అత్యంత కఠిన చట్టాన్ని తీసుకురానున్నారు. ఈ చట్టం అమలులోకి వచ్చాక.. దీనిని ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు, భారీగా జరిమానా విధించనున్నారు.

<strong>'భారీ' షాక్: ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయడం ఆలస్యమైతే.. అంతే!</strong>'భారీ' షాక్: ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయడం ఆలస్యమైతే.. అంతే!

నగదు లావాదేవీలను నిరుత్సాహపరచడమే లక్ష్యంగా ఆదాయ పన్ను చట్టంలో కీలక సవరణలు చేయనున్నారు. ఈ సవరణ ప్రధాన ఉద్దేశాన్ని పరిశీలిస్తే.. వస్తువును అమ్మేవాళ్లనే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.

రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చట్ట విరుద్ధం కానున్నాయి. ఒకే లావాదేవీలో రూ.3 లక్షలకు మించి నగదు చేయి మారితే అది పుచ్చుకున్న వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించినట్లే. ఆ లావాదేవీ గనుక ఆదాయపన్ను
శాఖ దృష్టిలో పడితే పుచ్చుకున్న మొత్తానికి రెట్టింపు జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుంది.

Cash Dealings Above Rs.3 Lakh Banned From April 1

ఉదాహరణకు.. ఒక వ్యక్తి రూ.10 లక్షల బంగారం కొని, అందులో రూ.4 లక్షలు నగదు రూపంలో చెల్లించాడనుకుందాం. ఈ లావాదేవీ అదాయపన్ను శాఖకు దొరికితే.. సదరు బంగారం దుకాణం యజమాని జరిమానా కింద రూ.4 లక్షలు చెల్లించాల్సిందే.

ఇదే విధంగా రూ.3 లక్షల పైచిలుకు నగదు చెల్లించి సెకండ్ హ్యాండ్ కారు గనుక కొంటే.. ఆ కార్ల దుకాణం యజమాని ఆ మొత్తం నగదును జరిమానా కింద చెల్లించాల్సిందే. ఆదాయ పన్ను చట్టంలో కొత్తగా 269 ఎస్ టి అనే నిబంధన చేరుస్తున్నారు. దీని ప్రకారం ఏ వ్యక్తి కాని, సంస్థ కాని రూ.3 లక్షలకు మించిన మొత్తం నగదుగా తీసుకోకూడదు.

ఒక వ్యక్తి నుంచి పలు విడతలుగా ఒక రోజులో రూ.3 లక్షలకు మించి నగదు తీసుకున్నా.. ఏక మొత్తంగా ఒకేసారి రూ.3 లక్షలకు మించి నగదు తీసుకున్నా.. ఒక సంఘటన లేదా ఒక సందర్భానికి సంబంధించి ఎన్ని విడతలుగానైనా రూ.3 లక్షలకు మించి నగదు తీసుకున్నా.. ఈ మూడు సందర్భాలలో ఆదాయ పన్ను చట్టం 269 ఎస్ టి నిబంధనను ఉల్లంఘించినట్లే.

English summary
Continuing with government steps to clamp down on black money, Finance Minister Arun Jaitley on Wednesday proposed to ban all cash transactions above Rs 3 lakh beginning April 1, 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X